నార్సింగిలో ఇంజనీర్ దారుణ హత్య

నార్సింగిలో ఇంజనీర్  దారుణ హత్య

రంగారెడ్డి  జిల్లా నార్సింగిలో ఓ ఇంజనీర్  దారుణ హత్యకు గురయ్యాడు. నార్సింగి పీఎస్ లిమిట్స్ లోని నిర్మానుష్య ప్రాంతానికి ఇజాయత్ అలీ అనే ఇంజనీర్ ను తీసుకొచ్చిన దుండుగులు.. గొంతు కోసి హత్య చేశారు. ఆతర్వాత కారును అక్కడే వదిలేసి పారిపోయారు దుండగులు.  దుబాయ్ లో  ఇంజనీర్ గా పనిచేస్తున్న ఇజాయత్ అలీ 20రోజుల కిందటే సిటీకి వచ్చాడు.  

కారులో ఇద్దరు యువకులు, ఓ లేడీ వచ్చినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. స్పాట్ కు చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.