విష్ణు10వ అవతారం కల్కీని నేనే.. అందుకే ఏడేండ్లుగా ఉద్యోగానికి రావటం లేదు.. ఇన్ని రోజులు ఏం చేశానంటే

విష్ణు10వ అవతారం కల్కీని నేనే.. అందుకే ఏడేండ్లుగా ఉద్యోగానికి రావటం లేదు.. ఇన్ని రోజులు ఏం చేశానంటే

ఆయనొక ప్రముఖ పేరుగాంచిన సంస్థలో ఇంజినీర్. కానీ ఏడేండ్లుగా ఉద్యోగానికి వెళ్లటం లేదు. ఎందుకు ఆఫీస్ కు రావటం లేదని ప్రశ్నిస్తే.. తాను విష్ణుమూర్తి పదవ అవతారం కల్కీనని చెప్పాడు. త్వరలోనే తన మహిమలు చూపిస్తానని చెప్పడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. అంతేకాదు తన గ్రాట్యుటీ డబ్బులు ఇవ్వకుంటే తన మహిమలతో చేసే పనికి దేశం మొత్త సఫర్ అవుతుందని హెచ్చరించాడు. తన మహిమలతో ఏం చేస్తాడో తెలియాలంటే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చదవాల్సిందే. 

గుజరాత్ కు చెందిన రామచంద్ర ఫెఫర్ అనే ఇంజినీర్ ప్రముఖ సర్దార్ సరోవర్ పునర్వస్వత్ ఏజెన్సీ (SSPA) అనే ప్రభుత్వ సంస్థలో పనిచేస్తుండేవాడు. ఉన్నట్లుండి 2018లో సడెన్ గా ఉద్యోగానికి బ్రేక్ ఇచ్చాడు. ఎన్ని సార్లు కబురు చేసినా ఆఫీస్ వెళ్లడం లేదు. దీంతో ఎందుకు రావడం లేదో కారణం చెప్పాలని లెటర్ పంపారు. దీనికి సమాధానంగా రాసిన వివరణ చూసి షాక్ అయ్యారు సీనియర్ అధికారులు. 

‘‘నేను విష్ణు మూర్తి 10వ అవతారం అయిన కల్కీని. త్వరలోనే రుజువు చేస్తా’’ నని రాయటంతో షాక్ అయ్యారు. తాను ఇన్నాళ్లుగా ఆఫీస్ కు రాకపోవడానికి కారణం.. తన నిర్లక్ష్యం కాదని.. దేవుడి బాధ్యతలు నెరవేర్చేందుకే రాలేకపోయానని తెలిపాడు. అంత గొప్ప బాధ్యతలను ఆఫీస్ లో కూర్చుని చేయాలేనని చెప్పాడు. 

2010 లోనే దేవుడిగా మారిపోయా...

తను 2010లోనే దేవుడిగా మారిపోయినట్లు మీడియాకు చెప్పాడు ఈ రామచంద్ర ఫెఫర్. 2010లోనే ప్రపంచంలో జరగబోయే విషయాలు ముందే ఊహించడంతో తనలో దైవత్వం ఉందని గుర్తించినట్లు చెప్పాడు. తను చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మహిమల వలన దేశంలో పాడిపంటలు బాగా పండుతున్నాయని చెప్పుకొచ్చాడు. గత 19 ఏళ్లుగా ఇండియాలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయంటే కారణం తన మహిమలేనని అన్నాడు. వర్షాలు కురవడమే కాదు.. తనకు రావాల్సిన గ్రాట్యుటీ ఇవ్వకుంటే దేషాన్ని కరువులోకి నెట్టేస్తానని హెచ్చరించాడు. 

సోషల్ మీడియా రెస్పాన్స్..

నేనే దేవుడిని అని చెప్పుకున్న ఈ ఇంజినీర్ గురించి తెలియడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీమ్స్, కామెంట్స్, జోక్స్ తో ట్రెండింగ్ లోకి వెళ్లింది ఈయన చేసిన వీడియో. అయితే ఏజెన్సీ మాత్రం ఇతని వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంది. ఇన్నాళ్లుగా ఉద్యోగానికి డుమ్మా కొట్టడంతో వర్క్ ప్రోగ్రెస్ ఆగిపోయిందని గరం మీద ఉన్నారట. దేశంలో నేనే దేవుడిని అని చెప్పుకునే వారి సంఖ్య ఎక్కువ అయిపోతోంది రోజురోజుకు. ఈ పేరుతో మూఢవిశ్వాలతో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాళ్లు కొందరైతే..  దేవుడి.. దేవుడి దగ్గరకే వెళ్లున్నానని ఆత్మార్పణం చేసుకునే వాళ్లు కొందరు. సైకాలజిస్ట్ లు ఇది మానసిక సమస్య అని.. పదే పదే దేవుడి గురించి ఆలోచించడం.. ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా ఊహించుకోవడం వలన ఇలాంటి సైకియాట్రిక్ సమస్యలు వస్తుంటాయని చెబుతున్నారు. రీడర్స్.. బీ కేర్ఫుల్.. ఏదైమైనా ఇలాంటి వాళ్లతో కాస్త జాగ్రత్త.

►ALSO READ | జమ్మూకాశ్మీర్లో టూరిస్టులపై టెర్రిరిస్టుల దాడి..ఐదుగురు మృతి..8మందికి గాయాలు