
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 428 ఇంజనీర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: ప్రాజెక్ట్ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి. వయసు 32 ఏళ్లు మించకూడదు.
ట్రెయినీ ఇంజనీర్: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 55 శాతం మార్కులతో బీటెక్/బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు 28 ఏళ్లు మించకూడదు.
సెలెక్షన్:రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక. ఆన్లైన్లో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.bel-india.in వెబ్సైట్లో చూడాలి.