నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్ యూనిట్లు/ కార్యాలయాల్లో 97 ఇంజినీర్, సీనియర్ కెమిస్ట్ తదితర ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 1 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. వివరాలకు www.nationalfertilizers.com వెబ్సైట్లో సంప్రదించాలి.