
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఇంజినీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాల్లో మొత్తం 167 పోస్టులు భర్తీ కానున్నాయి.
విద్యార్హతలు: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా, బీటెక్ చదివి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 నుంచి -30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి. మహిళా/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు. ఇతరులు రూ.200 చెల్లించాలి.
సెలెక్షన్: స్టేజ్-1(ప్రిలిమినరీ/ స్టేజ్-1) ఎగ్జామ్, స్టేజ్-2(మెయిన్/ స్టేజ్-2) ఎగ్జామ్, స్టేజ్-3(పర్సనాలిటీ టెస్ట్), మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ 2024 ఫిబ్రవరి 18న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.upsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.