డ్రగ్స్​ అమ్ముతున్న ఇంజినీరింగ్​ విద్యార్థులు అరెస్ట్​

డ్రగ్స్​ అమ్ముతున్న ఇంజినీరింగ్​ విద్యార్థులు అరెస్ట్​
  • మరోచోట  పట్టుబడిన ముగ్గురు
  • రూ.లక్షా 53వేల సరుకు స్వాధీనం

హైదరాబాద్ సిటీ, వెలుగు:  మాదాపూర్ రోడ్ నంబర్ 37లో బుధవారం రాత్రి డ్రగ్స్  అమ్ముతున్న  ముగ్గురు ఇంజినీరింగ్ ​స్టూడెంట్స్​ను ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి బైక్, రూ.70 వేల విలువైన  30 ఎల్ఎస్డీ బ్లాడ్స్ డ్రగ్​స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో చెన్నైకి చెందిన చరణ్ తేజ్, హైదరాబాద్​కు చెందిన కౌశిక్, సయ్యద్ సర్ఫరాజ్ ఉన్నారు. వీరు ఈజీ మనీకి అలవాటు పడి డ్రగ్స్ ​అమ్ముతున్నారు.

చెన్నై నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి విద్యార్థులకు సప్లై చేస్తున్న అరుణ్ రాజ్ పరారీలో ఉన్నాడని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. డ్రగ్స్​పట్టుకున్న డీటీఎఫ్​సీఐ శిరీష, కానిస్టేబుల్స్ నయీముద్దీన్, ఖయాముద్దీన్, మౌనికను ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​డైరెక్టర్​ కమలాసన్ రెడ్డి అభినందించారు.

మరో ఘటనలో ముగ్గురు..    

మాదాపూర్​లో అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో  డ్రగ్స్ అమ్మేందుకు ముగ్గురు యత్నిస్తున్న ట్టు పోలీసులకు సమాచారం అందింది. దీం తో    ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ డీఎస్పీ  తిరుపతి యాదవ్​ వెళ్లి దత్తి లితిన్, పడాల అభిరామ్  నాయుడు, కొడాలి ఎమార్ట్ ను పట్టుకున్నారు.
వారి నుంచి    83 వేల విలువ చేసే 5.77 గ్రాముల ఎండీఎంఏ  డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.   డ్రగ్స్ ను బెంగళూరు నుంచి తీసుకొచ్చిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు  పోలీసులు తెలిపారు.