కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు

కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు

కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు  ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు.  ఐదుగురు ఎగ్జిక్యూటివ్, సూపరిండెంట్ ఇంజినీర్లు హాజరయ్యారు.  ఉన్నతాధికారులకు తెలియకుండా తిరుపతిరావు అనే అధికారి ఏజెన్సీలకు రూ. 1600 కోట్ల బ్యాంకు గ్యారంటీలు ఇచ్చినట్లు కమిషన్ ముందు ఒప్పుకున్నారు ఇంజినీర్లు.  బ్యాంకు గ్యారంటీలు ఏజెన్సీలకు ఇచ్చే ముందు అండర్ టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా అని ఇంజనీర్లను ప్రశ్నించారు  కమిషన్ చీఫ్ చంద్ర గోష్.   తిరుపతిరావు బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన విషయం ఉన్నతాధికారుల దృష్టిలో లేదని  ఇంజినీర్లు చెప్పారు.

2022 జూలైలో భారీ వరదలు వచ్చాయని... ఆ వరదల కారణంగా సిసి బ్లాక్ దెబ్బతిన్నట్లు కమిషన్ ముందు చెప్పారు ఇంజినీర్లు. డ్యామేజ్ జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాసినట్లు కమిషన్ కు తెలిపారు ఇంజినీర్లు.  డిజైన్లు డ్రాయింగ్ లు  ఎవరు ప్రిపేర్ చేశారని ఇంజినీర్లను ప్రశ్నించారు.  వ్యాప్కొస్ సంస్థ డిజైన్ డ్రాయింగ్ ప్రిపేర్ చేసిందని.... సీఈసీడీవో అనుమతితో తాము అమలు చేశామని తెలిపారు ఇంజనీర్లు.

Also Read :- హైదరాబాద్ సిటీలో మూసీ నదిపై కొత్తగా 15 బ్రిడ్జీలు

   నిర్మాణానికి ముందు గ్రౌండ్లో ఏమైనా టెస్టులు జరిగాయా అని ఇంజనీర్లను ప్రశ్నించిది కాళేశ్వరం కమిషన్.  ఎన్ఐటి వరంగల్ ఆధ్వర్యంలో పలు పరీక్షలు జరిగినట్లు కమిషన్ ముందు చెప్పిన ఇంజనీర్లు.  బ్యారేజీ ల దగ్గర  డ్యామేజ్ కు కారణం ఏంటని ఇంజనీర్లను ప్రశ్నించారు  కమిషన్ చీఫ్ చంద్ర గోష్ . అయితే వరదలు అనుకున్న దానికంటే భారీగా రావడం వల్ల సిసి బ్లాక్ పొంగిందని తెలిపారు ఇంజనీర్లు.