పాల్వంచ, వెలుగు : సింగరేణి, జెన్కో ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పాల్వంచలోని కేటీ పీఎస్ 7వ దశ ఎదుట తెలంగాణ విద్యుత్ ఇంజినీర్స్ అసోసియేష న్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ మేరకు నల్ల బ్యాడ్జీ లు ధరించిన ఇంజినీర్లు 7వ దశ మెయిన్ గేట్ వద్ద ప్లేకార్డులు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకుడు మంగీలాల్ మాట్లాడుతూ ఎంతో నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు ఉన్న జె న్కోలో సింగరేణి భాగస్వామ్యాన్ని తాము ఒప్పుకునేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుబాబు, యాకూబ్, మహేశ్, శ్రావణ్ బాబు, శ్రీకాంత్, రాజేశ్, నరేందర్, నవీన్ ,యాస్మిన్, శ్రీనిధి ,అనూష, లక్ష్మి పాల్గొన్నా రు.