IND vs ENG 4th Test: భారత బౌలర్ల విజృంభణ.. తొలి సెషన్ లోనే 5 వికెట్లు

IND vs ENG 4th Test: భారత బౌలర్ల విజృంభణ.. తొలి సెషన్ లోనే 5 వికెట్లు

బజ్ బాల్ గేమ్ అంటూ ఇంగ్లాండ్ మరోసారి కష్టాల్లో పడింది. రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టుల్లో తొలి సెషన్ లోనే 5 వికెట్లను కోల్పోయింది. ఓ వైపు వేగంగా ఆడుతున్నా.. మరోవైపు వికెట్లను కోల్పోతూ వస్తుంది. దీంతో తొలి సెషన్ ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజ్ లో వికెట్ కీపర్ బెన్ ఫోక్స్(0) రూట్ (16) ఉన్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ కు ఓపెనర్లు డకెట్, క్రాలి ఆ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 47 పరుగులు జోడించి ఇంగ్లాండ్ కు మంచి పునాది వేశారు. పేసర్ సిరాజ్ వేసిన ఏడో ఓవర్లో క్రాలి తన విశ్వ రూపాన్ని చూపించాడు. ఈ ఓవర్ తొలి రెండు బంతుల్లో ఒక పరుగు మాత్రమే వచ్చింది. అయితే ఆ తర్వాత నాలుగు బంతుల్లో క్రాలి వరుసగా మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదడంతో ఒక్క ఓవర్లోనే ఏకంగా 19 పరుగులు వచ్చాయి.

ఈ దశలో ఆకాష్ దీప్ రూపంలో ఆ జట్టుకు అనుకోని షాక్ తగిలింది. నిప్పులు చెరిగే బంతులతో 10 పరుగుల వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు తీసుకొని ఇంగ్లాండ్ జట్టును చావు దెబ్బ కొట్టాడు.9వ ఓవర్ రెండో బంతికి డకెట్ (11) వికెట్ తీసి భారత్ కు తొలి బ్రేక్ ఇచ్చాడు.  ఇదే ఓవర్ లో నాలుగో బంతికి పోప్(0) ను ఎల్బీడబ్ల్యూ గా వెనక్కి పంపి ఒకే ఓవర్లో రెండు వికెట్లను తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఇన్నింగ్స్ 11 ఓవర్ 5వ బంతికి క్రాలి (42) ని క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లాండ్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. నిజానికి నాలుగో ఓవర్ ఐదో బంతికి క్రాలిని క్లీన్ బౌల్డ్ చేసినా.. అది నో బాల్ గా తేలింది. 

ఈ దశలో రూట్, స్టోక్స్ ఇంగ్లాండ్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగుతూ ఐదో వికెట్ కు 57 బంతుల్లోనే 52 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. లంచ్ కు ముందు మన స్పిన్నర్లు అశ్విన్, జడేజా విజ్రంభించడంతో స్వల్ప వ్యవధిలోనే బెయిర్ స్టో(38), స్టోక్స్(3) వికెట్లను కోల్పోయింది. భారత్ బౌలర్లలో ఆకాష్ దీప్ కు మూడు వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్, జడేజా తలో వికెట్ పడగొట్టారు.