వెస్టిండీస్ వేదికగా ఇంగ్లాండ్ వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టూర్ లో మొత్తం మూడు వన్డేలు, 5 వన్డేలు జరుగుతాయి. అక్టోబర్ 30 న వన్డేలతో ప్రారంభం కానున్న ఈ సిరీస్.. నవంబర్ 17 న ఐదో టీ20తో ముగుస్తుంది. ఈ పర్యటనకు మొత్తం 14 మంది సభ్యులతో కూడిన ఇంగ్లాండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు బుధవారం (అక్టోబర్ 2) ప్రకటించింది. ఈ సిరీస్ కు ఇంగ్లాండ్ జట్టులో టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు చోటు దక్కలేదు. ఇటీవలే జాతీయ జట్టులో రావడానికి స్టోక్స్ ఆసక్తి కనబర్చినా సెలక్టర్లు అతని పేరును పరిగణించలేదు.
ALSO READ | Legends League Cricket: హోరెత్తించిన కివీస్ ప్లేయర్.. 12 బంతుల్లో 9 సిక్సర్లతో విధ్వంసం
స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లాండ్ హండ్రెడ్ లీగ్ ఆడుతూ బట్లర్ గాయపడ్డాడు. ఈ క్రమంలో ఇటీవలే స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ కు దూరమయ్యాడు. బట్లర్ చేరికతో ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ జట్టులో ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్‌లను ఎంపిక చేయడం ఆశ్చర్యకరంగా మారింది. జాఫర్ చోహన్, డాన్ మౌస్లీ, జాన్ టర్నర్ తొలిసారి ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పాకిస్థాన్ తో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది.
వెస్టిండీస్ పర్యటనకు ఇంగ్లండ్ జట్టు
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, జాఫర్ చోహన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జామీ ఓవర్‌టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్.
వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ టీ20 షెడ్యూల్
మొదటి వన్డే - గురువారం - అక్టోబర్ 31
రెండో వన్డే - శనివారం- నవంబర్ 2
మూడో వన్డే - బుధవారం- నవంబర్ 6
వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లండ్ టీ20 షెడ్యూల్
మొదటి టీ20- నవంబర్ 9- శనివారం
రెండో టీ20- నవంబర్ 10 -ఆదివారం
మూడో టీ20- నవంబర్ 14- గురువారం
నాల్గవ టీ20- నవంబర్ 16- శనివారం
ఐదవ టీ20- నవంబర్ 17- ఆదివారం
Jafer Chohan wins his first international call-up, Jos Buttler returns as captain in England's squad for the white-ball tour of the West Indies 🏴 pic.twitter.com/pMgL8j68u7
— ESPNcricinfo (@ESPNcricinfo) October 2, 2024