సెప్టెంబరులో యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ వన్డే, టీ20 సిరీస్ లు ఆడనుంది. కంగారూల జట్టుతో సెప్టెంబర్ 11 నుండి 15 వరకు మూడు టీ20లు.. సెప్టెంబర్ 19 నుండి 29 వరకు ఐదు వన్డేల్లో ఇంగ్లాండ్ తలపడుతుంది. ఈ సిరీస్ లకు ఇంగ్లాండ్ సోమవారం (ఆగస్టు 26) తమ టీ20, వన్డే స్క్వాడ్ లను ప్రకటించింది. 15 మందితో కూడిన వన్డే, టీ20 జట్టులకు కెప్టెన్ గా బట్లర్ వ్యవహరిస్తాడు.
జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ లాంటి స్టార్ ప్లేయర్లకు ఈ స్క్వాడ్ లో చోటు దక్కలేదు. బెయిర్‌స్టో, మోయిన్ కలిసి 400 పైగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉన్నా.. వన్డే, టీ20 వరల్డ్ కప్ లో వారి పేలవ ప్రదర్శన కారణంగా పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో వైట్ బాల్ ఫార్మాట్ లో వీరిద్దరి కెరీర్ ముగిసినట్టుగానే కనిపిస్తుంది. వీరితో పాటు క్రిస్ జోర్దాన్ కు సైతం ఈ టూర్ లో అవకాశం దక్కలేదు. ది హండ్రెడ్ టోర్నీలో ఆడుతున్న జోఫ్రా ఆర్చర్ రెండు జట్లలోనూ తన స్థానాన్ని నిలుపుకున్నాడు.
సీనియర్ ప్లేయర్ రూట్ వర్క్ మేనేజ్ మెంట్ లోడ్ కింద రెస్ట్ ఇచ్చారు. హ్యారీ బ్రూక్, గుస్ అట్కిన్సన్, బెన్ డకెట్, జామీ స్మిత్, మాథ్యూ పాట్స్ టీ20 సిరీస్ కు రెస్ట్ తీసుకోగా.. వన్డే సిరీస్ కు అందుబాటులో ఉంటారు. రెండు ఫార్మాట్ లలో మొత్తం ఐదుగురు కొత్త ఆటగాళ్లకు చోటు దక్కింది. లెఫ్ట్ ఆర్మ్ సీమర్ జోష్ హల్, ఆల్ రౌండర్ జాకబ్ బెథెల్ పేస్ బౌలర్ జాన్ టర్నర్ రెండు ఫార్మాట్‌లలో ఎంపికయ్యారు. డాన్ మౌస్లీ, జోర్డాన్ కాక్స్ టీ20 జట్టుకు ఎంపికయ్యారు.
England's T20i squad Vs Australia:
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 26, 2024
Buttler (C), Archer, Rashid, Jacks, Livingstone, Salt, Topley, Jacob Bethell, Carse, Cox, Curran, Josh Hull, Mahmood, Mousley and John Turner.
ODI Squad:
Buttler (C), Archer, Atkinson, Bethell, Brook, Carse, Duckett, Hull, Jacks, Potts,… pic.twitter.com/eXeeQiXpbX