డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఎన్నో అంచనాల మధ్య వరల్డ్ కప్ లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్ పరిస్థితి అద్వానంగా తయారైంది. పేపర్ మీద ఎంతో బలంగా కనబడుతున్న ఇంగ్లాండ్ జట్టు మైదానంలో మాత్రం ఊహకందని రీతిలో చిత్తవుతుంది. బజ్ బాల్ క్రికెట్ అంటూ ప్రపంచాన్ని తమవైపుకు తిప్పుకున్న ఇంగ్లీష్ టీం అత్యంత పేలవ ఆటతీరుతో విమర్శకులకు కారణమవుతుంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో ఓడిపోయి టోర్నీ నుండి వెళ్లిపోయే స్థితికి చేరుకుంది.
ప్రస్తుతం ఒక్కటే మ్యాచులో నెగ్గిన ఇంగ్లాండ్ సెమీస్ కు చేరాలంటే అద్భుతమే జరగాలి. మిగిలిన నాలుగు మ్యాచ్ ల్లో ఖచ్చితంగా గెలవడంతో పాటు వాటిలో భారీ విజయాలను నమోదు చేయాలి. ఇంతా చేసినా సెమీస్ కు వెళ్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మిగిలిన జట్లు ఫలితాల కూడా ఇంగ్లాండ్ కు అనుకూలంగా మారాలి. ఈ లెక్కన చిన్న జట్లయినా ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్, శ్రీలంక జట్లు భారత్, దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ జట్లకు షాక్ ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read :- రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చిన ధోనీ
అన్నిటికంటే ముందు అక్టోబర్ 29 న టీమిండియాతో మ్యాచ్ గెలవడం ఆ జట్టుకు శక్తికి మించిన సవాలే. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో నాలుగేసి విజయాలు సాధించిన సౌత్ ఆఫ్రికా, కివీస్ జట్లు మరో రెండు మ్యాచ్ లు గెలిచినా సెమీస్ కు చేరతాయి. భారత్ ఆడిన 5 మ్యాచ్ ల్లో గెలవడం ద్వారా మరో నాలుగు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ గెలిచినా సెమీస్ కు అర్హత సాధిస్తుంది.
ఇక ఇంగ్లాండ్ సెమీస్ కు చేరాలంటే ఆస్ట్రేలియా వరుసగా అన్ని మ్యాచ్ లు ఓడిపోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆసీస్ ఉన్న ఈ ఫామ్ చూస్తుంటే ఇది జరగని పనే. నెట్ రన్ రేట్ కూడా ఇంగ్లాండ్ కు ప్రతికూలంగా మారింది. దీంతో ఇంగ్లాండ్ సెమీస్ కు చేరాలంటే అద్భుతం జరగాల్సిందే. కేవలం 5 శాతం అవకాశాలు మాత్రమే ఇంగ్లాండ్ కు ఉన్నాయి. మరి ఆటతో పాటు అదృష్టం కూడా ఇంగ్లాండ్ కి కలిసి వస్తుందేమో చూడాలి. తో పాటు