సెయింట్ జార్జ్: భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ఫిల్ సాల్ట్ (109 నాటౌట్) సెంచరీతో చెలరేగడంతో.. శనివారం అర్ధరాత్రి జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో విండీస్ లీడ్‌ను 2–1కి తగ్గించింది. తొలుత వెస్టిండీస్ 20 ఓవర్లలో 222/6 స్కోరు చేసింది. పూరన్ (82), పావెల్ (39) రాణించారు.
తర్వాత ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 226/3 స్కోరు చేసి గెలిచింది. సాల్ట్‌కు తోడుగా బట్లర్ (51), లివింగ్‌స్టోన్ (30), హ్యారీ బ్రూక్ (31 నాటౌట్) దంచికొట్టారు. ఫిల్ సాల్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 బుధవారం జరుగుతుంది.