హ్యారీ బ్రూక్.. ఈ ఇంగ్లాండ్ యువ ఆటగాడిని 2023 ఐపీఎల్ కోసం సన్ రైజర్స్ రికార్డ్ స్థాయిలో 13 కోట్లు పెట్టి జట్టులోకి తీసుకున్నారు. సూపర్ ఫామ్ లో ఉండడండంతో ఈ ఇంగ్లాండ్ ఆటగాడికి భారీ మొత్తాన్ని వెచ్చించి ఆశలు పెట్టుకున్నారు. ఒక్క సెంచరీ మినహా ఆడిన ప్రతి మ్యాచ్ లో బ్రూక్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో 13 కోట్లు అనవసరమని భావించి 2024 ఐపీఎల్ లో రిటైన్ చేసుకోకుండా రిలీజ్ చేసింది. అయితే తాజాగా బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి..తనకు రిలీజ్ చేయడం ఎంత తప్పో తెలియజేశాడు.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా 5 వన్డేల సిరీస్ లో ఇంగ్లాండ్ తొలి రెండు టీ20 లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. కీలకమైన మూడో మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఎట్టలకే విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ సాల్ట్ సెంచరీతో చెలరేగినా.. మ్యాచ్ గెలిపించింది మాత్రం హ్యారీ బ్రూక్. చివరి ఓవర్ కు 21 పరుగులు కావాల్సిన దశలో బ్రూక్ వరుసగా 4,6,6,2,6 బాది మరో బంతి మిగిలి ఉండగానే మ్యాచ్ ఫినిష్ చేసాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 7 బంతుల్లో 31 పరుగులు చేసి ఇంగ్లాండ్ సిరీస్ ఆశలను సజీవంగా ఉంచాడు.
మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనా పూరన్ 45 బంతుల్లో 82 పరుగులు చేసి విండీస్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 223 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 19.5 ఓవర్లలో ఛేజ్ చేసింది. ఓపెనర్ సాల్ట్ 56 బంతుల్లో 9 సిక్సులు, 4 ఫోర్లతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిస్తే.. బట్లర్ 51 పరుగులతో రాణించాడు. చివర్లో లివింగ్ స్టోన్( 18 బంతుల్లో30), బ్రూక్(7 బంతుల్లో 31) వేగంగా ఇంగ్లాండ్ కు ఈ సిరీస్ లో తొలి విజయాన్ని అందించారు.
The brilliant Harry Brook at his best #WIvENG #Cricket pic.twitter.com/hBdWiE0w1N
— Saj Sadiq (@SajSadiqCricket) December 16, 2023