ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత బౌలర్లు తడబడినా.. చివర్లో పుంజుకున్నారు. 7 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్న ఇంగ్లాండ్.. చివరి మూడు వికెట్లను 6 పరుగుల వ్యవధిలో కోల్పోయారు. జడేజా ఇంగ్లాండ్ టెయిలెండర్ లను చక చక పెవిలియన్ కు పంపించాడు. దీంతో ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్ లో 353 పరుగుల డీసెంట్ స్కోర్ చేసింది. రూట్ 121 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
7 వికెట్లకు 302 పరుగులతో తొలి రోజు ఆటను ముగించిన ఇంగ్లాండ్.. రెండో రోజు అదే జోరును కొనసాగించింది. రాబిన్సన్, రూట్ భారత బౌలర్లను సంవర్ధవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో ఒకదశలో ఇంగ్లాండ్ 400 పరుగులు చేసేలా కనిపించింది. అయితే రాబిన్సన్ ఔట్ కావడంతో ఒక్కసారిగా ఇంగ్లాండ్ కుప్పకూలింది. భారత బౌలర్లలో జడేజాకు నాలుగు వికెట్లు దక్కాయి. ఆకాష్ దీప్ కు 3 వికెట్లు..సిరాజ్ 2 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకోగా, ఇండియా ఈ సిరీస్‌లో ఆకాశ్ రూపంలో నాలుగో కొత్త పేసర్‌కు చాన్స్ ఇచ్చింది. ఆరంభంలో కొత్త బాల్‌తో మంచి బౌన్స్, స్వింగ్‌తో చెలరేగిన ఆకాశ్.. ఇంగ్లండ్ టాపార్డర్‌ను ముప్పు తిప్పలు పెట్టాడు. రెండో ఎండ్‌లో సిరాజ్ (2/60) లైన్ అండ్ లెంగ్త్‌లో ఇబ్బందిపడినా తర్వాత కుదురుకున్నాడు. 22వ ఓవర్‌లో అశ్విన్.. బెయిర్‌స్టోను ఔట్ చేసి నాలుగో వికెట్‌కు 52 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. 25వ ఓవర్లో జడేజా.. కెప్టెన్ బెన్ స్టోక్స్ (3)ను పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లండ్ 112/5తో లంచ్‌కు వెళ్లింది.
ALSO READ : IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. స్టార్ ఓపెనర్‌కు గాయం
ఇన్నింగ్స్‌పై ఇండియాకు పట్టు లభించినట్లు కనిపించినా రెండో సెషన్‌లో రూట్ అడ్డుగోడలా నిలబడ్డాడు. ఫోక్స్‌తో కలిసి ఈ సెషన్‌లో టీమిండియా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. పేసర్లు, స్పిన్నర్లు ఎదురుదాడి మొదలుపెట్టినా రూట్ ఏమాత్రం తడబడలేదు. ఈ క్రమంలో కెరీర్‌లో 31వ సెంచరీ (219 బాల్స్‌లో)ని సాధించాడు. గత 15 ఇన్నింగ్స్‌ల్లో అతనికిది తొలి సెంచరీ. మరో ఎండ్‌లో ఫోక్స్(47) కూడా అదే స్థాయిలో రూట్‌కు అండగా నిలబడ్డాడు. చివరి 5 వికెట్లను ఇంగ్లాండ్ ఏకంగా 241 పరుగులు చేయడం విశేషం
England 🏴 All out 353 1st innings
— Fourth Umpire (@UmpireFourth) February 24, 2024
Joe Root remain unbeaten on 122.
One of best innings under pressure 🙌 #WPL2024 #ImranRiazKhan #INDvENG #PSL2024 #PSL #MaryamNawaz #PZvMS #LCFC #BabarAzam #INDvsENGTest pic.twitter.com/Q1HPNaBgE2