భారత పర్యటనలో ఇంగ్లాండ్ జట్టుకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఎంపిక చేసిన ఆటగాళ్లు గాయాల బారిన పడడంతో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి దిగేందుకు ఆ జట్టు ఫీల్డర్లు కూడా కొదవయ్యారు. దీంతో ధర్మశాల టెస్టుకు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లుగా ఇంగ్లాండ్ కోచింగ్ స్టాఫ్ పాల్ కాలింగ్‌వుడ్, మార్కస్ ట్రెస్కోథిక్‌లను తీసుకున్నారు. ఏదేని ఆటగాడు గాయపడితే వీరు మైదానంలోకి దిగనున్నారు.
రెహాన్ అహ్మద్
మొత్తం 15 మంది సభ్యులు గల జట్టును ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) భారత పర్యటనకు ఎంపిక చేసింది. వీరిలో గాయం కారణంగా రెహాన్ అహ్మద్ స్వదేశానికి తిరిగి వెళ్లిపోవడంతో ఆ సంఖ్య 14కు తగ్గింది. పోనీ, వారైనా అందుబాటులో ఉన్నారా..! అంటే అదీ లేదు. చివరి టెస్టుకు ముందు ఓలీ రాబిన్సన్ అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో ఆ జట్టుకు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లు కొదవయ్యారు. చేసేదేమీలేక ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ కోచింగ్ స్టాఫ్‌ను సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లుగా ఎంపికచేసింది.
ALSO READ :- Indian Wells 2024: తప్పుకున్న నాదల్.. భారత టెన్నిస్ స్టార్‌కు మరో అవకాశం
ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఒక జట్టు గరిష్టంగా ఆరుగురు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ల పేర్లు ఇవ్వడానికి అనుమతి ఉంటుంది. పర్యాటక జట్టు బెంచ్‌లో ఇద్దరే అందుబాటులో ఉండడంతో ఇంగ్లాండ్‌కు మరో దారి కనిపించలేదు. దీంతో మాజీ క్రికెటర్లు పాల్ కాలింగ్‌వుడ్, మార్కస్ మైదానంలోకి ధర్మశాల టెస్ట్ ప్రత్యామ్నాయ ఫీల్డర్లుగా ప్రకటించింది.
Paul Collingwood and Marcus Trescothick, two former England greats have been listed as substitute fielders for the Test match in Dharamshala. According to the ICC Playing Conditions, teams are allowed to name a maximum of six substitute fielders, and England has turned to their… pic.twitter.com/QuxCZnr6C5
— Satya Prakash (@Satya_Prakash08) March 7, 2024