147 ఏండ్ల టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్రలో ఇంగ్లాండ్ నయా రికార్డ్

147 ఏండ్ల టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్రలో ఇంగ్లాండ్ నయా రికార్డ్

వెల్లింగ్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పలు రికార్డులు బద్దలుకొట్టింది. 147 ఏండ్ల టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్రలో 5 లక్షల రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన తొలి జట్టుగా వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డు సృష్టించింది. 1082వ టెస్టులో ఈ ఘనత అందుకుంది. ఆస్ట్రేలియా (4,28,868 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), ఇండియా (2,78,751 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. కాగా, బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (92), జాకబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీథెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (96), జో రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (73 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), హ్యారీ బ్రూక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (55) హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీలతో చెలరేగడంతో.. శనివారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇంగ్లీష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 76 ఓవర్లలో 378/5 స్కోరు చేసింది. 

దీంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 533 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (35 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు.  టెస్టుల్లో వంద ఫిఫ్టీలు సాధించిన నాలుగో బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూట్‌‌ అరుదైన రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఇక 86/5 ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 34.5 ఓవర్లలో 125 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. విలియమ్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (37) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. గస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అట్కిన్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4/31)  హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించాడు. దీంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరఫున ఈ ఫీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించిన 15వ బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రికార్డులకెక్కాడు. 2017లో మొయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత ఇంగ్లిష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్‌‌ ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. బైడన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యార్సీ 4 వికెట్లు తీశాడు.