ఇన్నాళ్లకు అలిసిపోయాడు: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌

అలిస్టర్ కుక్.. ఈ పేరు తెలియని క్రికెట్ ప్రేమికులు లేరు. మనకు ఎంఎస్ ధోని ఎలాగో.. ఇంగ్లాండ్ జట్టుకు కుక్ అలాగా. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఇంగ్లీష్ జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు.. ఈ 38 ఏళ్ల వెటరన్ బ్యాటర్. ఇంతలా పొగుడుతున్నారేంటి.. అనుకోకండి. అతని సాధించిన పరుగులు, జట్టుకు అతను అందించిన విజయాలే అంత కీర్తిని తెచ్చి పెట్టాయి.

17 ఏళ్ల పాటు క్రికెట్ ప్రయాణం

2006లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అలిస్టర్ కుక్.. ఇన్నాళ్లకు అలిసిపోయాడు. 17 ఏళ్ల పాటు క్రికెట్ కు తన జీవితాన్ని అంకితం చేసిన కుక్.. నేడు ఆ ప్రయాణానికి ముగింపు పలికాడు. 2018లో టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ఈ గ్రేట్ కెప్టెన్.. పదిరోజుల క్రితం దాకా కౌంటీ మ్యాచ్‌లు ఆడారు. ఇక అలిసిపోయాను అనుకున్నారేమో శుక్రవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి విరామం తీసుకుంటున్నట్లు ప్రకటన చేశారు.

"ప్రొఫెషనల్ క్రికెటర్‌గా నేను ఈ రోజు నా క్రికెట్ కెరీర్ ముగింపును ప్రకటిస్తున్నాను.. వీడ్కోలు చెప్పడం అంత సులభం కాదు. రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ఆడి అలిసిపోయాను.. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కలలో కూడా ఊహించని ప్రదేశాలను సందర్శించాను. జీవితాంతం తోడుండే ఎందరో సస్నేహితులు దొరికారు. 11 ఏళ్లలోపు విక్‌హామ్ బిషప్‌ల తరపున ఆడిన ఎనిమిదేళ్ల బాలుడి నుండి ఇప్పటి వరకు.. న ప్రయాణం ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. అన్నింటికీ మించి, ఈ సమయంలో నేను చాలా సంతోషం చేశారు. ఇక ముగింపు పలికి.. కొత్త బాధ్యతలు చేపట్టాలనుకుంటున్నాను.." అని కుక్ ఎసెక్స్ ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో ప్రకటన చేశారు.