ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ క్రికెటర్ అలెక్స్ హేల్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మూడు ఫార్మాట్లలోనూ ఇంగ్లండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హేల్స్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
ALSO READ: ఇక దబిడి దిబిడే.. ఆర్‌సీబీ కొత్త కోచ్‌గా మాజీ కెప్టెన్
2011లో భారత్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసిన హేల్స్.. 2014లో వన్డేల్లో, 2015లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చారు. ఏడాదికాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నహేల్స్.. చివరిసారిగా ఇంగ్లండ్ జట్టు తరుపున 2022 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడారు.
ఇంగ్లండ్ తరుపున 11 టెస్టులు, 70 వన్డేలు, 75 టీ20లు ఆడిన అలెక్స్ హేల్స్.. వరుసగా టెస్టుల్లో 573, వన్డేల్లో2419, టీ20ల్లో2074 పరుగులు చేశారు.
BREAKING: England batter Alex Hales has announced his retirement from international cricket pic.twitter.com/dmXIS9yMfb
— ESPNcricinfo (@ESPNcricinfo) August 4, 2023
156 Matches?
— England Cricket (@englandcricket) August 4, 2023
5066 Runs ?
578 Fours ?
123 Sixes ?
T20 World Cup Winner ?
Thank you, Alex ?
Alex Hales has announced his retirement from international cricket. pic.twitter.com/xXOUmFjide