ఇంగ్లండ్‌‌ క్రికెటర్లు ఇన్హేలర్లను వాడుతున్నారు..

ఇంగ్లండ్‌‌ క్రికెటర్లు ఇన్హేలర్లను వాడుతున్నారు..

న్యూఢిల్లీ: ఇండియా వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఇంగ్లండ్‌‌ క్రికెటర్లు ఇన్హేలర్లను వాడుతున్నారు. సాధారణంగా అస్తమా ఉన్న వ్యక్తులు దీన్ని ఉపయోగిస్తారు. కానీ ఇండియాలో మ్యాచ్‌‌లు జరిగే ప్రధాన నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరుగుతుండటంతో ఇంగ్లిష్‌‌ క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెంగళూరులో శ్రీలంకతో మ్యాచ్‌‌కు ముందు బెన్‌‌ స్టోక్స్‌‌ ఇన్హేలర్‌‌ను వాడటం కనిపించింది. మిగతా ప్లేయర్లు కూడా ఏదో ఓ దశలో వాటిని వినియోగిస్తున్నట్లు బ్రిటీష్‌‌ వార్తాపత్రిక ‘ఐ’ పేర్కొంది. ఢిల్లీ, ముంబైతో పోలిస్తే అహ్మదాబాద్‌‌లో గాలి నాణ్యత కాస్త బెటర్‌‌గా ఉంది. 2017లో న్యూ ఢిల్లీలో టెస్ట్ సిరీస్‌‌లోని మూడో మ్యాచ్‌‌లో శ్రీలంక ఆటగాళ్లు మైదానంలో ఉన్నప్పుడు మాస్క్‌‌లు ధరించాల్సి వచ్చింది. లాన్సెట్ అధ్యయనం ప్రకారం, కాలుష్యం కారణంగా 2019లో భారతదేశంలో 2.3 మిలియన్లకు పైగా మరణాలు సంభవించాయి.

ALSO READ : ఫేవరెట్‌‌గా అఫ్గానిస్తాన్‌‌ వరల్డ్‌‌ కప్‌‌లో నెదర్లాండ్స్‌‌తో కీలక పోరు