IND vs ENG, 1st ODI: ఇంగ్లాండ్ డీసెంట్ టోటల్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

IND vs ENG, 1st ODI: ఇంగ్లాండ్ డీసెంట్ టోటల్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

నాగ్‌పూర్ వన్డేలో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థి ఇంగ్లాండ్ ను ఓ మాదిరి స్కోర్ కే పరిమితం చేశారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌట్ అయింది. జోస్ బట్లర్ 52 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాకబ్ బెతేల్ 51 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్లు సాల్ట్(43), బెన్ డకెట్ ఇంగ్లాండ్ కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లలో జడేజా హర్షిత్ రానా తలో మూడు వికెట్లు తీసుకున్నారు. కుల్దీప్, అక్షర్, షమీలకు తలో వికెట్ దక్కింది. 

హోరెత్తించిన ఓపెనర్లు:

టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ తీసుకోగా.. ఓపెనర్లు సాల్ట్, డకెట్ టీ20 తరహాలో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఇద్దరూ ధాటిగా ఆడడంతో 6 ఓవర్లలోనే 50 పరుగుల మార్క్ ను అందుకుంది. ఇద్దరూ జోరు మీదున్న సమయంలో సమన్వయ లోపంతో సాల్ట్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత డకెట్ లను ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను కష్టాల్లో పడేశాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్ మూడో బంతికి డకెట్ ను ఆ తర్వాత చివరి బంతికి బ్రూక్ ను ఔట్ చేశాడు.

ALSO READ | Virat Kohli: మొన్న మెడ, ఇప్పుడు మోకాలు.. ఇదేనా ఫిట్‌నెస్‌ ఫ్రీక్ అంటే..: కోహ్లీపై మాజీ క్రికెటర్ సెటైర్లు

నిలబెట్టిన బట్లర్, బెతేల్ :

సీనియర్ ప్లేయర్ రూట్ 19 పరుగులే చేసి ఔట్ కావడంతో ఇంగ్లాండ్ 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ ను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను బట్లర్, బెతేల్ తీసుకున్నారు. భాగస్వామ్యాన్ని నిర్మిస్తూ ఐదో వికెట్ కు 59 పరుగులు జోడించారు. ఈ దశలో బట్లర్ ను అక్షర్ ఔట్ చేసి దెబ్బ కొట్టాడు. ఇక్కడ నుంచి ఇంగ్లాండ్ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. చివర్లో ఆర్చర్ వేగంగా 21 పరుగులు చేసి స్కోర్ కార్డును 240 పరుగులు దాటించాడు.