భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా చివరి టెస్టు రేపు( మార్చి 7) జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్.. ఆ తర్వాత వరుసగా మూడు టెస్టులు ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఐదో టెస్టులో భారత్ ను ఓడించడానికి సన్నాహకాలు ప్రారంభిస్తుంది. తాజాగా ఈ టెస్టు మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది.
రాంచీలో ముగిసిన నాలుగో టెస్ట్ నుంచి ఇంగ్లాండ్ జట్టులో ఒక్క మార్పు చేశారు. ఫాస్ట్ బౌలర్ ఆలీ రాబిన్సన్ ప్లేస్ లో మార్క్ వుడ్ కు స్థానం కల్పించారు. రాబిన్సన్ అర్ధ సెంచరీతో రాణించినా బౌలింగ్ లో ప్రభావం చూపించకపోవడంతో వేటు తప్పలేదు. దీంతో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగబోతుంది. రాంచీ టెస్టులో ఇంగ్లాండ్ ఓడిపోయినా.. రాబిన్సన్ మినహా మిగిలిన బౌలర్లు ఆకట్టుకున్నారు. అండర్సన్ తమ స్వింగ్ తో ఇబ్బంది పెడితే.. షోయాబ్ బషీర్ ,హర్టీలి భారత్ ను వణికించారు. దీంతో ఇంగ్లాండ్ పై గెలవాలంటే భారత్ శక్తిమేర రాణించాల్సిందే.
ధర్మశాల పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కు అనూకూలిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీమిండియా ఐదో టెస్టులో బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ లను ఆడించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే కుల్దీప్ యాదవ్, జడేజా, అశ్విన్ ఒకరికి బెంచ్ కు పరిమితం కావాల్సి వస్తుంది. ఒకవేళ ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగితే నాలుగో టెస్టులో రాణించిన ఆకాష్ దీప్ పై వేటు పడటం ఖాయంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో పడికల్, రజత్ పటిదార్ లలో ఎవరికి అవకాశం దక్కుతుందో ఆసక్తికరంగా మారింది.
England's playing XI for the 5th Test:
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 6, 2024
Crawley, Duckett, Pope, Root, Bairstow, Stokes (C), Foakes (WK), Hartley, Wood, Bashir and Anderson. pic.twitter.com/ZYwkG8RZDq