Cricket World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. ఓడితే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్

Cricket World Cup 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. ఓడితే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఔట్

వరల్డ్ కప్ లో నేడు(నవంబర్ 8) నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పూణే వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ ఇప్పటికే ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. నెదర్లాండ్స్ కు ఇదే చివరి అవకాశం. ఆడిన 7 మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఈ టోర్నీలో మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. ఈ రెండు గెలిస్తేనే 2025 లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుంది. దీంతో ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలవడం చాలా కీలకంగా మారింది. 

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI):

జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్, వికెట్ కీపర్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్

నెదర్లాండ్స్ (ప్లేయింగ్ XI): 

వెస్లీ బరేసి, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్, వికెట్ కీపర్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దట్ట్, పాల్ వాన్ మీకెరెన్