Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌కు ఊరట.. సౌతాఫ్రికాపై ఇంగ్లాండ్ బ్యాటింగ్

Champions Trophy 2025: ఆఫ్ఘనిస్తాన్‌కు ఊరట.. సౌతాఫ్రికాపై ఇంగ్లాండ్ బ్యాటింగ్

ఛాంపియన్స్ ట్రోఫీలో మరో కీలక మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్ తో సౌతాఫ్రికా గ్రూప్ బి లో చివరి లీగ్ మ్యాచ్ ఆడనున్నారు. కరాచీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ కు కీలకం కానుంది. ఇంగ్లాండ్.. సౌతాఫ్రికాపై 207 పరుగుల తేడాతో గెలిస్తే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు చేరుతుంది. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేయడం ఆఫ్గన్ జట్టుకు కలిస్ రానుంది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. మార్క్ వుడ్ స్థానంలో సాకిబ్ మహమ్మద్ రానున్నాడు. మరోవైపు రెండు సౌతాఫ్రికా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కెప్టెన్ బావుమాకు రెస్ట్ ఇచ్చి క్లాసన్ ని తుది జట్టులోకి వచ్చాడు. ఓపెనర్ టోనీ డి జార్జి స్థానంలో స్టబ్స్ వచ్చాడు. తాత్కాలిక కెప్టెన్ గా మార్కరం బాధ్యతలు స్వీకరించనున్నాడు. 

ALSO READ : Champions Trophy 2025: ఆ జట్టుతోనే టీమిండియా సెమీ ఫైనల్ ఆడే ఛాన్స్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI):

ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI):

ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎన్గిడి