Cricket World Cup 2023: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్.. కీలక మ్యాచ్‌కు మ్యాక్స్‌వెల్, మార్ష్ దూరం

వరల్డ్ కప్ లో భాగంగా నేడు( నవంబర్ 4) ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ తలపడుతుంది. ఇప్పటికే సెమీస్ కు దూరమైన ఇంగ్లాండ్ ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరో వైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ కు మరింత చేరువ కావాలని భావిస్తుంది. అహ్మదాబాద్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఆసీస్ జట్టులో  ఆల్ రౌండర్లు మ్యాక్స్‌వెల్, మార్ష్ ఈ మ్యాచ్ కు దూరమయ్యారు. వీరి స్థానాల్లో ఆల్ రౌండర్ గ్రీన్, స్టోయినీస్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది.          

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI):

జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(w/c), మోయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

ALSO READ :- Cricket World Cup 2023: జట్టులో లేకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నా : హార్దిక్ పాండ్య ఎమోషనల్

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):

డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(w), కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్(సి), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్