IND vs ENG: ఇంగ్లాండ్‌దే టాస్.. ఇండియా బ్యాటింగ్.. జడేజా, షమీలకు రెస్ట్

IND vs ENG: ఇంగ్లాండ్‌దే టాస్.. ఇండియా బ్యాటింగ్.. జడేజా, షమీలకు రెస్ట్

భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో వన్డే ప్రారంభమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. చివరి మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన భావిస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ మ్యాచ్ లో ఇండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. 

ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చి అతని స్థానంలో అర్షదీప్ కు తుది జట్టులో స్థానం కల్పించారు. జడేజా స్థానంలో సుందర్ ప్లేయింగ్ 11 లోకి వచ్చాడు. మరోవైపు ఇంగ్లాండ్ ఒక్క ఆమార్పుతో బరిలోకి దిగుతుంది. ఆర్చర్ స్థానంలో టామ్ బాంటన్ జట్టులోకి వచ్చాడు.      

Also Read : ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ నుంచి యువ సంచలనం ఔట్

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): 

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్

భారత్ (ప్లేయింగ్ XI):

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్