ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ లో స్టార్ పేసర్లుగా జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తమదైన ముద్ర వేశారు. ఈ ఇద్దరి జోడీని తట్టుకొని నిలబడాలంటే ప్రత్యర్థులకు సవాలుగా మారేది. సొంతగడ్డపై ఈ ద్వయం పూనకం వచ్చినట్టు చెలరేగేవారు. దశాబ్ధానికి పైగా క్రికెట్ లో తమదైన ముద్ర వేసిన వీరు రిటైర్మెంట్ ప్రకటించారు. 2023 లోనే బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పగా.. ఇటీవలే అండర్సన్ తన ఆటకు వీడ్కోలు పలికారు. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాలు లేకుండానే ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా వెస్టిండీస్ తో ఇంగ్లాండ్ గురువారం (జూలై 18) నుంచి రెండో టెస్ట్ జరగనుంది. ఈ టెస్టుకు ఇప్పటికే ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ప్రకటించారు. ఫాస్ట్ బౌలర్ అండర్సన్ తొలి టెస్ట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానంలో మార్క్ వుడ్ కు తుది జట్టులో స్థానం దక్కింది. మరో ఇద్దరు పేసర్లుగా క్రిస్ వోక్స్, గుట్కిన్సన్ ఉన్నారు. 12 ఏళ్ళ తర్వాత సొంతగడ్డపై జేమ్స్ అండర్సన్, బ్రాడ్ లేకుండా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ ఆడటం ఇదే తొలిసారి కావడం విశేషం.
ALSO READ : Mohammed Shami: ప్రాక్టీస్ మొదలెట్టిన షమీ.. రీ ఎంట్రీ అప్పుడే
చివరిసారిగా 2012లో ఇంగ్లాండ్ బ్రాడ్, అండర్సన్ లేకుండా స్వదేశంలో టెస్ట్ మ్యాచ్ ఆడింది. 2006లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంగ్రేటం చేసిన స్టువర్ట్ బ్రాడ్...తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో మైలురాయిలను అధిగమించాడు. ఇంగ్లాండ్ తరుపున స్టువర్ట్ బ్రాడ్ 166 టెస్టుల్లో 600 వికెట్లు సాధించాడు. 2002 లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అండర్సన్ ఇప్పటివరకు 187 టెస్టుల్లో 704 వికెట్లు పడగొట్టాడు.