
రాంచీ: వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ స్వదేశానికి వెళ్లిపోయాడు. అతను మళ్లీ ఇండియాకు వచ్చే చాన్స్ లేదని ఈసీబీ శుక్రవారం తెలిపింది. అతని ప్లేస్‌లో కొత్త వారిని తీసుకునే అవకాశం కూడా లేదని స్పష్టం చేసింది. తొలి మూడు టెస్ట్‌లు ఆడిన 19 ఏళ్ల రెహాన్ 44 యావరేజ్‌తో 11 వికెట్లు తీశాడు. రెండో టెస్ట్‌లో ఆరు వికెట్ల హాల్ కూడా సాధించాడు. ఇక సిరీస్ మధ్యలో రెస్ట్ కోసం అబుదాబి వెళ్లినప్పుడు రెహాన్ వీసా సమస్యలతో ఇబ్బందిపడ్డాడు.