టీ20 క్రికెట్ అంటే ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లే అందరికీ గుర్తొస్తాయి. భారీ హిట్టర్లు ఉన్న ఈ జట్లు టీ20 ల్లో అసలైన మజాను అందిస్తాయి. ఇక ఈ రెండు జట్లు కలిసి ఆడితే బౌండరీల వర్షం కురవడం గ్యారంటీ. విండీస్ వేదికగా జరుగుతున్న 5టీ20ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు కొదమ సింహాల్లా పోరాడుతున్నాయి. నువ్వా నేనా అనేట్లుగా పోటీపడుతూ భారీ స్కోర్లు నమోదు చేస్తున్నాయి. తాజాగా ఈ రోజు(డిసెంబర్ 20) ట్రినిడాడ్ వేదికగా జరిగిన నాలుగో టీ20 అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది.
మొదట చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. టీ20ల్లో 200 పరుగులు దాటితేనే భారీ స్కోర్ గా భావిస్తే.. ఇంగ్లాండ్ ఏకంగా 267 పరుగులు చేసింది. ఓపెనర్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 57 బంతుల్లో 10 సిక్సులు, 7 ఫోర్లతో 119 పరుగులు చేసి విండీస్ బౌలర్లను ఉతికారేసాడు. సాల్ట్‌తో పాటు బట్లర్ (55), లివింగ్‌స్టోన్ (54), విల్ జాక్స్(24) పరుగుల వరద పారించారు.
లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు పోరాడినప్పటికీ 15.3 ఓవర్లలో విండీస్.. 192 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ 75 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-2 తో సమం చేసింది. ఆండ్రీ రసెల్ (25 బంతుల్లో 51, 3 బౌండరీలు, 5 సిక్సర్లు) ధాటిగా ఆడినా లక్ష్యం మరీ పెద్దది కావడంతో విండీస్ కు పరాజయం తప్పలేదు. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు మొత్తం కలిపి 459 పరుగులు రాబట్టారు.అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగుల నమోదు చేసి ఆల్ టైం రికార్డ్ నమోదు చేశాయి.
ఇరు జట్లు కలిపి 33 సిక్సులు కొట్టడం ద్వారా ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్ల విషయంలో మూడో స్థానంలో ఈ మ్యాచ్ నిలిచింది.ఇంగ్లాండ్ ఆటగాడు సాల్ట్ అంతర్జాతీయ క్రికెట్ లో వరుసగా రెండో సెంచరీ చేయడం విశేషం. మూడో టీ20లో సాల్ట్ 56 బంతుల్లో 109 పరుగులు చేసాడు. ఇరు జట్ల మధ్య మూడో టీ20 డిసెంబర్ 22 న జరుగుతుంది.
Bowled out by playing 15.3 overs.
— Nawaz ?? (@Rnawaz31888) December 20, 2023
England level the series by 2-2 with 1 remaining.
Battle of Sixes in this Series.#WIvsENG #CricketTwitter pic.twitter.com/8QwGiWcFOB