IND vs ENG, 2nd Test: 255 పరుగులకు టీమిండియా ఆలౌట్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే..?

IND vs ENG, 2nd Test: 255 పరుగులకు టీమిండియా ఆలౌట్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే..?

వైజాగ్ టెస్టులో ఇంగ్లాండ్ ముందు టీమిండియా భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్ లో 143 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించిన భారత్.. రెండో ఇన్నింగ్స్ లో 255 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. యువ బ్యాటర్ శుభమాన్ గిల్ 104 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. 132 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో గిల్ తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్ పటేల్ 45 పరుగులతో రాణించినా  మిగిలిన వారందరూ విఫలమయ్యారు. 

లంచ్ తర్వాత గిల్, అక్షర్ పటేల్ సమర్ధవంతంగా ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కొన్నారు. అయితే టీ విరామానికి ముందు క్రీజ్ లో పాతుకుపోయిన ఈ ఇద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. టీ బ్రేక్ తర్వాత భారత్ వెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. భరత్(6), కుల్దీప్ యాదవ్ (0) పెవిలియన్ కు క్యూ కట్టారు. అయితే అశ్విన్ (29) బుమ్రా సహకారంతో కొన్ని విలువైన పరుగులు జోడించాడు.   ఇంగ్లాండ్ బౌలర్లలో హార్టీలికు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. రెహన్ అహ్మద్ కు మూడు, అండర్సన్ రెండు వికెట్లు తీశారు. బషీర్ కు ఒక వికెట్ దక్కింది. 
    
తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ (209) చేయడంతో భారత్ 396 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ బుమ్రా దెబ్బకు 253 పరుగులకే ఆలౌటైంది. క్రాలి 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.