ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య బుధవారం (ఆగస్టు 21) నుంచి మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నేడు తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు నల్లటి బ్యాండ్ లు ధరించి బరిలోకి దిగుతున్నారు. ఈ నెల ప్రారంభంలో మరణించిన మాజీ ఇంగ్లాండ్ బ్యాటర్ గ్రాహం థోర్ప్‌కు ఇంగ్లీష్ జట్టు నివాళులర్పిస్తుంది. బుధవారం (ఆగస్టు 21) మొదటి టెస్టు జాతీయ గీతానికి ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లు ఈ ప్రముఖ క్రికెటర్‌ను స్మరించుకుంటారు.
ఈ ఐకానిక్ గ్రౌండ్‌లోని పెద్ద స్క్రీన్‌పై అతని నివాళి వీడియో కూడా ప్లే చేయబడుతుంది. స్టోక్స్ గాయంతో స్టాండ్-ఇన్ కెప్టెన్ పోప్.. ఇంగ్లాండ్ దిగ్గజం థోర్ప్ గురించి ఇలా అన్నాడు. "మేము మ్యాచ్ మొత్తం మా చేతులకు నల్లటి బ్యాండ్‌లు ధరించి ఉంటాము. మ్యాచ్ కు ముందు అతనికి నివాళులు అర్పిస్తాం. అతను గొప్ప వ్యక్తి. అతనితో కలిసి మూడు సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేయడం చాలా గొప్ప అనుభూతి". అని పోప్ అన్నాడు. మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.
Also Read :- డాక్టర్లు, ఇంజనీర్లు కాదు.. విద్యార్థులకు మను బాకర్ సలహా
మాజీ బ్యాటర్.. దిగ్గజ క్రికెటర్ గ్రాహం థోర్ప్ సోమవారం ఉదయం (ఆగస్టు 5) మరణించారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) ఒక పత్రికా ప్రకటనలో అతను మరణించినట్లు తెలిపింది.1969లో జన్మించిన థోర్ప్.. 1993లో ఇంగ్లాండ్ తరపున అరంగేట్రం చేశాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్ కు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లాండ్ తరపున 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ఇతను ఒకడు. వీటితో 82 వన్డేలను ఆడాడు. మొత్తం 16 సెంచరీలతో పాటు 9000 పైగా పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్రే తరపున కౌంటీ మ్యాచ్ ల్లో 49 సెంచరీలు.. 45.04 సగటుతో 21,937 పరుగులు చేశాడు.
శ్రీలంకతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు:
డాన్ లారెన్స్, బెన్ డకెట్, ఆలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, మార్క్ వుడ్, షోయబ్ బషీర్.
England to pay tribute to Graham Thorpe ahead of Manchester Test
— SportsTiger (@The_SportsTiger) August 21, 2024
📷: ECB#engvsl #engvssl #testcricket #ecb #grahamthorpe pic.twitter.com/X1ia5XtnPC