టీమిండియాతో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తొలి టెస్టులో గెలిచిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ టెస్టులో ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదే ఊపులో రెండో టెస్టు గెలిచేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. వైజాగ్ వేదికగా రేపు (ఫిబ్రవరి 2) మ్యాచ్ జరగనుండగా..ఈ టెస్టు కోసం తాజాగా ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ 11 ను ప్రకటించింది. రెండు మార్పులతో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో బరిలోకి దిగబోతుంది.
గాయపడిన స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో షోయబ్ బషీర్ వచ్చి చేరాడు. మరోవైపు తొలి టెస్టులో విఫలమైన మార్క్ వుడ్ పై ఇంగ్లాండ్ వేటు వేసింది. ఈ ఫాస్ట్ బౌలర్ స్థానంలో లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సన్ ను ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 లో చేర్చింది. తొలి టెస్టులో ఈ దిగ్గజ పేసర్ కు స్థానం దక్కని సంగతి తెలిసిందే. మరోవైపు బ్యాటింగ్ లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. వైజాగ్ టెస్ట్ కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ నెట్స్ లో బౌలింగ్ వేస్తూ కనిపించాడు. తొలి టెస్టులో ఒక్క ఓవర్ కూడా వేయని స్టోక్స్ ఈ మ్యాచ్ లో బౌలింగ్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ మ్యాచ్ కోసం భారత్ ఎలాంటి ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగుతుందో ఆసక్తికరంగా మారింది. తొలి రెండు టెస్టులకు కోహ్లీ వ్యక్తిగత కారణాల వలన తప్పుకోగా..ఈ టెస్టు లో బాగా ఆడిన రాహుల్, జడేజా గాయాలతో దూరమయ్యారు. సెలక్టర్లు వీరి స్థానాల్లో సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్ టన్ సుందర్, సౌరబ్ కుమార్ లను ఎంపిక చేశారు. దీంతో తుది జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం కనిపిస్తుంది. తొలి టెస్టులో ఓడిన మన జట్టు ఒత్తిడిలో కనిపిస్తుంటే.. ఇంగ్లాండ్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది.
ఇంగ్లండ్ జట్టు:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్స్టో, బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్
?England name XI for 2nd Test ?
— SportsTiger (@The_SportsTiger) February 1, 2024
England made two changes with Shoaib Bashir replacing Jack Leach who has been ruled out with a knee injury. James Anderson comes in for Mark Wood.
?: ECB#INDvENG #TestCricket #EnglandCricket #JamesAnderson #ShoaibBashir #MarkWood #BenStokes… pic.twitter.com/c0cUeeqBKX