
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ తొలి మ్యాచ్ కు సిద్ధమవుతుంది. శనివారం (ఫిబ్రవరి 22) ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. టోర్నమెంట్ లో ఇది నాలుగో మ్యాచ్ కాగా.. ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. గ్రూప్ బి లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు కూడా ఉన్నాయి. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో ఈ మ్యాచ్ కు భారీ హైప్ నెలకొంది. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు జరుగుతుంది.
ఈ మ్యాచ్ కు ఒక రోజు ముందు ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ 11 ప్రకటించింది. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ ఓపెనింగ్ చేస్తారు. మూడో స్థానంలో ఇంగ్లాండ్ జేమీ స్మిత్ కు అవకాశం ఇచ్చింది. జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వస్తారు. బ్యాటింగ్ ఆల్ రౌండర్ గా లియామ్ లివింగ్‌స్టోన్, బౌలింగ్ ఆల్ రౌండర్ గా బ్రైడాన్ కార్స్ తుది జట్టులో అర్హత సాధించారు. ఫాస్ట్ బౌలర్లుగా జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్ లు ఎంపికయ్యారు. ఏకైక స్పిన్నర్ గా ఆదిల్ రషీద్ ప్లేయింగ్ 11 లో కొనసాగుతాడు.
ALSO READ | Ranji Trophy 2025: గుజరాత్‌పై థ్రిల్లింగ్ సెమీస్.. 74 ఏళ్ళలో తొలిసారి రంజీ ఫైనల్లో కేరళ
ఇటీవలే కాలంలో వన్డేల్లో ఇంగ్లాండ్ ప్రదర్శన ఏమీ బాగాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ తో వన్డే సిరీస్ 0-3 తేడాతో క్లీన్ స్వీప్ అయింది. జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఎవరూ కూడా నిలకడగా రాణించలేకపోతున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా శ్రీలంకపై తాజాగా వన్డే సిరీస్ ను 0-2 తేడాతో కోల్పోయింది. పైగా స్టార్ బౌలర్లు కమ్మిన్స్, హేజల్ వుడ్, స్టార్క్ ఆ జట్టులో లేరు. దీంతో కంగారూల జట్టు కూడా బలహీనంగా కనిపిస్తుంది.
ఆస్ట్రేలియాతో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ తుది జట్టు:
ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్) , జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
ENGLAND 11 FOR THE MATCH vs AUSTRALIA IN CHAMPIONS TROPHY:
— Johns. (@CricCrazyJohns) February 20, 2025
Salt, Duckett, Jamie Smith, Root, Brook, Buttler, Livingstone, Carse, Archer, Rashid, Wood pic.twitter.com/bFrKcBmxT4