టీమిండియాతో జరగబోయే మూడో టీ20కి ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ 11 ను ప్రకటించింది. రాజ్ కోట్ వేదికగా మంగళవారం(జనవరి 28) జరగనున్న మూడో టీ20కి ఇంగ్లాండ్ ఎలాంటి మార్పులు చేయకపోవడం విశేషం. రెండో టీ20 ఆడిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. బట్లర్ సారధ్యంలోని ఇంగ్లాండ్ జట్టు తొలి రెండు టీ20ల్లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయింది. సొంతగడ్డపై భారత్ విజృంభించడంతో తొలి రెండు టీ20ల్లో ఇంగ్లాండ్ కు పరాజయాలే ఎదురయ్యాయి. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఇప్పటికే తొలి రెండు టీ 20 మ్యాచ్ లు ఓడిపోయి 0-2 తో వెనకబడిన ఇంగ్లాండ్ కు రేపు జరగనున్న మ్యాచ్ చావో రేవో లాంటింది.
ఈ మ్యాచ్ లోనూ ఓడిపోతే ఇంగ్లాండ్ సిరీస్ కోల్పోతుంది. దీంతో రేపు జరగనున్న మ్యాచ్ ఎలాగైనా గెలవాలని తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. బ్యాటింగ్ పై ఆ జట్టు ఫోకస్ చేయనుంది. కెప్టెన్ బట్లర్ మినహాయిస్తే మిగిలిన ఆటగాళ్లందరూ విఫలమవుతున్నారు. ముఖ్యంగా సాల్ట్, లివింగ్ స్టోన్ చేతులెత్తేస్తున్నారు. హ్యారీ బ్రూక్ కు మంచి ఆరంభాలు లభిస్తున్నా భారీ స్కోర్ చేయలేకపోతున్నాడు.
ALSO READ | BBL 2024-25 Final: హోబర్ట్ హరికేన్స్‌కు బిగ్ బాష్ లీగ్ టైటిల్.. భారీ స్కోర్ చేసి ఓడిన వార్నర్ సేన
బ్రైడన్ కార్స్ రాణించడం ఆ జట్టుకు ఊరటనిస్తోంది. 17 బంతుల్లోనే 3 సిక్సర్లు.. ఒక ఫోర్ తో 31 పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రథమమైన స్కోర్ అందించాడు. బౌలింగ్ లో 4 ఓవర్లలో కేవలం 29 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ లో సీనియర్ బౌలర్ ఆర్చర్ భారీగా పరుగులిస్తున్నాడు. అతను ఫామ్ లోకి రావాలని జట్టు ఆశిస్తోంది. మార్క్ వుడ్, రషీద్ పర్వాలేదనిపిస్తున్నారు.
టీమిండియాతో మూడో టీ20కు ఇంగ్లాండ్ జట్టు:
బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
England announce an unchanged XI for the 3rd T20I against India 🏴 pic.twitter.com/beLaVsiJnx
— ESPNcricinfo (@ESPNcricinfo) January 27, 2025