![IND vs ENG: టీమిండియాతో రెండో వన్డే.. ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను రంగంలోకి దింపుతున్న ఇంగ్లాండ్](https://static.v6velugu.com/uploads/2025/02/england-playing-11-vs-india-in-2nd-odi-vs-india_uVpTUQH4Jc.jpg)
కటక్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ ఆదివారం (ఫిబ్రవరి 9) రెండో వన్డేకు సిద్ధమయ్యాయి. తొలి వన్దేలో గెలిచి టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉంటే.. ఇంగ్లాండ్ ఎలాగైనా రెండో వన్డే గెలవాలనే ఒత్తిడిలో ఉంది. ఈ మ్యాచ్ లో రోహిత్ సేన గెలిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది. మరోవైపు రేపు జరగనున్న వన్డేలో గెలిస్తేనే సిరీస్ లో ఆశలు సజీవంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో నేపథ్యంలో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. రాత్రి 9:30 నిమిషాలకు మ్యాచ్ జరగనుంది.
మార్క్ వుడ్, అట్కిన్సన్ లకు చోటు
తొలి వన్డేలో ఇంగ్లాండ్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమైంది. బ్యాటింగ్ లో బట్లర్ సేన ఎలాంటి మార్పులు చేసే అవకాశం కనిపించడం లేదు. అనుభవం లేని వికెట్ కీపర్ బ్యాటర్ జెమీ స్మిత్ ను ఆ జట్టు ఆడించే సాహసం చేయకపోవచ్చు. ఇక బౌలింగ్ లో రెండు మార్పులు చేయనుంది. సాకిబ్ మహమ్మద్ స్థానంలో స్పీడ్ సంచలనం మార్క్ వుడ్ కు జట్టులోకి రానున్నాడు. బ్రైడం కార్స్ స్థానంలో అట్కిన్సన్ కు చోటు అవకాశం రానుంది. తొలి వన్డేలో ఆదిల్ రషీద్ ఏ ఒక్క బౌలర్ ఆకట్టుకోలేదు. దీంతో మార్క్ వుడ్, అట్కిన్సన్ లపై ఇంగ్లాండ్ భారీ ఆశలే పెట్టుకుంది.
టీమిండియా విషయానికి వస్తే కటక్ వన్డే కోహ్లీ ఆడడం కన్ఫర్మ్ అయిపోయింది. మోకాలి నొప్పి కారణంగా తొలి వన్డేకు దూరమైన విరాట్ జైశ్వాల్ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. కోహ్లీ అసలైతే శ్రేయాస్ అయ్యర్ స్థానంలో తుది జట్టులోకి రావాలి. కానీ కోహ్లీ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ వచ్చి అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 36 బంతుల్లోనే 59 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మరోవైపు తొలి వన్డేలో జైశ్వాల్ ఆకట్టుకొలేకపోయాడు. జైశ్వాల్ బెంచ్ కు పరిమితం కావొచ్చు. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే భారత్ తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగొచ్చు.