ముల్తాన్ వేదికగా పాకిస్థాన్ తో మంగళవారం (అక్టోబర్ 15) ఇంగ్లాండ్ రెండో టెస్ట్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం సోమవారం (అక్టోబర్ 14) ఇంగ్లాండ్ జట్టు ప్లేయింగ్ 11 ను ప్రకటించారు. గాయం కారణంగా చివరి నాలుగు టెస్టులకు దూరమైన ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రీ ఎంట్రీ ఇచ్చాడు. హండ్రెడ్ లీగ్ లో స్టోక్స్ గాయపడ్డాడు. ఈ క్రమంలో శ్రీలంకతో జరిగిన మూడు టెస్టులతో పాటు.. పాకిస్థాన్ తో జరిగిన తొలి టెస్టుకు దూయమయ్యాడు.
ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఆశ్చర్యకరంగా గుస్ అట్కిన్సన్, క్రిస్ వోక్స్‌లకు ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చారు. ఫామ్ లో ఉన్న ఈ ఇద్దరినీ పక్కన పెట్టడంతో పాక్ జట్టును ఇంగ్లాండ్ తక్కువగా అంచనా వేసారేమో అనే అనుమానం కలుగుతుంది. వీరిద్దరి స్థానంలో కెప్టెన్ స్టోక్స్ తో పాటు.. మాథ్యూ పాట్స్‌కు తుది జట్టులో చోటు దక్కింది. ఇద్దరు స్పిన్నర్లుగా జాక్ లీచ్, షోయబ్ బషీర్ కొనసాగుతారు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ పై ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో ఉంది.
ALSO READ | Border–Gavaskar Trophy: ఆసీస్‌కు బిగ్ షాక్.. భారత్‌తో సిరీస్‌కు స్టార్ ఆల్ రౌండర్ దూరం
మరోవైపు వరుస ఓటముల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్ తో జరగబోయే చివరి రెండు టెస్టులకు స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన పలికింది. ఆదివారం (అక్టోబర్ 13) ప్రకటించిన జట్టులో మాజీ కెప్టెన్ బాబర్ అజామ్, షాహీన్ షా ఆఫ్రిది లపై వేటు వేసింది. నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, సర్ఫరాజ్ అహ్మద్‌లకు సైతం చోటు దక్కలేదు.
పాకిస్థాన్ తో రెండో టెస్టుకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్ ), జామీ స్మిత్ (వికెట్ కీపర్), బ్రైడన్ కార్సే, మాట్ పాట్స్, జాక్ లీచ్, షోయబ్ బషీర్
Ben Stokes is back for Multan 2.0! #PAKvENG
— 🏏Flashscore Cricket Commentators (@FlashCric) October 14, 2024
Chris Woakes and Gus Atkinson will be rested this week. pic.twitter.com/Lx60cOrRPH