3.1 ఓవర్లలోనే ఖేల్ ఖతం.. ఒమన్‌‌పై ఇంగ్లండ్ రికార్డు విక్టరీ

3.1 ఓవర్లలోనే ఖేల్ ఖతం.. ఒమన్‌‌పై ఇంగ్లండ్ రికార్డు విక్టరీ

నార్త్ సౌండ్ (అంటిగ్వా) : ఆదిల్ రషీద్  (4/11) నాలుగు వికెట్లతో విజృంభించడంతో  టీ20 వరల్డ్ కప్‌‌లో ఇంగ్లండ్ రికార్డు సాధించింది. గురువారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్‌‌–బి మ్యాచ్‌‌లో ఇంగ్లిష్‌‌ టీమ్ 8 వికెట్ల తేడాతో ఒమన్‌‌ను చిత్తు చేసి సూపర్–8 అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. తొలుత రషీద్ దెబ్బకు ఒమన్‌‌ 13.2 ఓవర్లలో 47 రన్స్‌‌కే కుప్పకూలింది. షోయబ్ ఖాన్ (11) తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌‌కే పరిమితం అయ్యారు. 

జోఫ్రా ఆర్చర్ (3/12), మార్క్‌‌ వుడ్ (3/12) చెరో మూడు వికెట్లు పడగొట్టారు. తర్వాత ఇంగ్లండ్ 3.1 ఓవర్లలోనే 50/2 స్కోరు చేసి గెలిచింది. బట్లర్ (8 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 24 నాటౌట్‌‌), ఫిల్ సాల్ట్ (3 బాల్స్‌‌లో 2 సిక్సర్లతో 12) రాణించారు.  ఆదిల్ రషీద్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌ అవార్డు లభించింది. కాగా, మరో 101 బాల్స్‌‌ మిగిలుండగానే  ఛేజింగ్‌‌ పూర్తి చేసిన  ఇంగ్లండ్‌‌ టీ20 వరల్డ్ కప్‌‌లో మిగిలిన బాల్స్‌‌ పరంగా అతి పెద్ద విజయం సాధించింది. 2014లో శ్రీలంక మరో 90 బాల్స్‌‌ మిగిలుండగా నెదర్లాండ్స్‌‌ను ఓడించిన రికార్డు బ్రేక్ అయింది. మొత్తంగా ఈ మ్యాచ్‌‌ 99 బంతుల్లోనే పూర్తయింది. టీ20 వరల్డ్ కప్‌‌లో అతి తక్కువ బంతులు పడ్డ రెండో మ్యాచ్ ఇది. ‌‌