IND vs ENG: క్రాలే హాఫ్ సెంచరీ.. ఇంగ్లాండ్ దే తొలి సెషన్

IND vs ENG: క్రాలే హాఫ్ సెంచరీ.. ఇంగ్లాండ్ దే తొలి సెషన్

ధర్మశాల టెస్టులో ఇంగ్లాండ్ కు గొప్ప ఆరంభమే లభించింది. తొలి సెషన్ లో భారత బౌలర్లలను సమర్ధవంతంగా అడ్దుకున్నారు. దీంతో లంచ్ సమయానికి ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ఓపెనర్ క్రాలే(61), రూట్(0)  క్రీజ్ లో ఉన్నారు. 27 పరుగులు చేసిన బెన్ డకెట్, 11 పరుగులు చేసిన పోప్ కుల్దీప్ యాదవ్ యాదవ్ బౌలింగ్ లో ఔటయ్యారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు ఓపెనర్లు క్రాలే,బెన్ డకెట్ ఎప్పటిలాగే శుభారంభాన్ని ఇచ్చారు. మొదట్లో ఆచితూచి ఆడినా.. ఆ తర్వాత క్రమంగా బ్యాట్ ఝళిపించారు. బుమ్రా, సిరాజ్ బౌలింగ్ ను అలవోకగా ఎదుర్కొని బౌండరీల వర్షం కురిపించారు. ఈ దశలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భారత జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. తొలి వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత ఒక భారీ షాట్ కు ప్రయత్నించి డకెట్  ఔటయ్యాడు. 

శుభమన్ గిల్ పట్టిన అద్భుత క్యాచ్ తో భారత్ కు ఈ వికెట్ లభించింది. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన పోప్ తో కలిసి క్రాలే 36 పరుగులు జోడించి స్కోర్ ను 100 పరుగులకు చేర్చాడు. ఈ దశలో కుల్దీప్ యాదవ్ మరోసారి మ్యాజిక్ చేశాడు. పోప్ ను అవుట్ చేసి టీమిండియాకు రెండో వికెట్ అందించాడు.