మాంచెస్టర్ : శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. జెమీ స్మిత్ (72 బ్యాటింగ్), హ్యారీ బ్రూక్ (56) హాఫ్ సెంచరీలు చేయడంతో.. గురువారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో 259/6 స్కోరు చేసింది. స్మిత్‌తో పాటు గస్ అట్కిన్సన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. 22/0 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇంగ్లిష్ బ్యాటర్లను స్టార్టింగ్‌లో లంక బౌలర్లు కట్టడి చేశారు.
బెన్ డకెట్ (18), డాన్ లారెన్స్ (30), ఒలీ పోప్ (6) వరుస విరామాల్లో ఔట్ కావడంతో ఇంగ్లండ్ 67 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్రూక్.. రూట్ (42)తో నాలుగో వికెట్‌కు 58, స్మిత్‌తో ఐదో వికెట్‌కు 62 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. తర్వాత స్మిత్, వోక్స్ (25) ఆరో వికెట్‌కు 52 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను ఆధిక్యంలోకి తెచ్చారు.