Cricket World Cup 2023: వన్డే చరిత్రలో ఇంగ్లాండ్ సరికొత్త చరిత్ర.. తొలి జట్టుగా అరుదైన ఘనత

Cricket World Cup  2023: వన్డే చరిత్రలో ఇంగ్లాండ్ సరికొత్త చరిత్ర.. తొలి జట్టుగా అరుదైన ఘనత

వరల్డ్ కప్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచులో న్యూజిలాండ్ భారీ విజయాన్ని నమోదు చేసింది. 282 పరుగులను 36.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఔరా అనిపించింది. కాన్వే 121 బంతుల్లో 152 పరుగులు, రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 123 పరుగులు చేసి కివీస్ కి అద్భుత విజయాన్ని అందించారు. ఈ మ్యాచులో న్యూజిలాండ్ గెలిచినా.. ఇంగ్లాండ్ మాత్రం ఒక అరుదైన రికార్డు నమోదు చేసింది.

ప్రపంచ క్రికెట్ లో ఇంగ్లాండ్ కి ఉన్న బ్యాటింగ్ డెప్త్ బహుశా ఏ టీంకి ఉండదేమో. జట్టులో ఒకరే హాఫ్ సెంచరీ కొట్టినా స్కోర్ మాత్రం 282 పరుగులకు చేరుకుంది. ఇంగ్లాండ్ జట్టులో 11 మంది ఆటగాళ్లు రెండంకెల స్కోర్ చేయడం విశేషం వన్డే క్రికెట్ లో ఇలా జరగడం ఇదే తొలిసారి. దీంతో ఇంగ్లాండ్ ఎవ్వరికీ సాధ్యం కాని ఒక రికార్డ్ ని తన పేరిట లిఖించుకుంది. 

ఇక ఈ మ్యాచులో టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న న్యూజిలాండ్  మొదటి ఇంగ్లాండ్ బ్యాటర్లను తక్కువ స్కోర్ కే నమోదు చేస్తూ 282 పరుగులకు పరిమితం చేసింది. ఇంగ్లాండ్ జట్టులో రూట్ 77 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో హెన్రికి 3 వికెట్లు, సాంట్నర్, ఫిలిప్స్ కి చెరో రెండు వికెట్లు లభించాయి.