వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడుతున్నాయి. కోల్ కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించారు. పాక్ బౌలర్లను చితక్కొడుతూ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ ప్రారంభంలో కాస్త ఆచితూచి ఆడినా క్రమంగా జోరు పెంచారు. ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్టు బ్యాట్ ఝళిపించడంతో పాక్ ముందు 338 పరుగుల భారీ లక్ష్యాన్ని సెట్ చేసింది. ఆల్ రౌండర్ స్టోక్స్ 84 పరుగులు చేసి వరుసగా రెండో సారి ఇంగ్లాండ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టోక్స్ తో పాటు రూట్ (60), బెయిర్ స్టో(59) హాఫ్ సెంచరీలు చేశారు. ఇక ఓపెనర్ మలాన్(31), కెప్టెన్ బట్లర్(27), యువ ప్లేయర్ హ్యారీ బ్రూక్(30) తలో చేయి వేసి ఇంగ్లాండ్ స్కోర్ బోర్డును 330 పరుగులు దాటించారు.
పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ మూడు వికెట్లు తీసుకోగా.. షహీన్ ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్ కు చెరో రెండు వికెట్లు లభించాయి. ఇఫ్తికార్ అహ్మద్ కు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా 2025 లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుంది. మరోవైపు పాకిస్థాన్ ఈ మ్యాచ్ లో గెలిచినా నెట్ రన్ రేట్ లేని కారణంగా ఇంటిదారి పడుతుంది.
#England vs #Pakistan, 44th Match
— Ariana Television (@ArianaTVN) November 11, 2023
ENG 337/9 (50) CRR: 6.74
Innings Break
---------------------------------------
To Watch England vs Pakistan, Live, Please visit the link below:https://t.co/umsVG4bV90
Live is available only in Afghanistan and please make sure you are not… pic.twitter.com/cdngd24ZnD