తిరువనంతపురం/గువాహతి: వన్డే వరల్డ్‌కప్ ముంగిట వార్మప్స్‌లో న్యూజిలాండ్ తమ బ్యాటింగ్ పవర్ చూపెట్టింది. తొలి పోరులో పాకిస్తాన్‌ను ఓడించిన న్యూజిలాండ్ సోమవారం జరిగిన రెండో వార్మప్‌లోనూ భారీ స్కోరు చేసి 7 రన్స్ తేడాతో (డక్‌వర్త్) సౌతాఫ్రికాపై గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత కివీస్ 50 ఓవర్లలో 321/6 స్కోరు చేసింది. డేవాన్ కాన్వే (78), లాథమ్ (52), గ్లెన్ ఫిలిప్స్ (43) రాణించారు. సఫారీ బౌలర్లలో ఎంగిడి, మార్కో జాన్సెన్ చెరో మూడు వికెట్లు తీశారు.
ఛేజింగ్‌లో సౌతాఫ్రికా 37 ఓవర్లలో 211/4 స్కోరుతో నిలిచిన టైమ్‌లో వర్షంతో ఆట ఆగింది. డక్‌వర్త్ ప్రకారం అప్పటికి సఫారీల టార్గెట్‌ను 219 రన్స్‌గా లెక్కగట్టి కివీస్‌ను విజేతగా తేల్చారు. డికాక్(84 నాటౌట్), డుసెన్ (51) రాణించారు. వాన అడ్డొచ్చిన మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల (డక్‌వర్త్) తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. తొలుత బంగ్లా 37 ఓవర్లలో 188/9 స్కోరు చేసిన టైమ్‌లో వర్షం వచ్చింది. అక్కడితో బంగ్లా ఇన్నింగ్స్‌ను ముగించి ఇంగ్లండ్ టార్గెట్‌ను 197 రన్స్‌గా లెక్కగట్టగారు. మొయిన్ అలీ (56), బెయిర్ స్టో (34), బట్లర్ (30) మెరుపులతో ఇంగండ్ 24.1 ఓవర్లలోనే 197/6 స్కోరు చేసి గెలిచింది.