రాంచీ టెస్టులో ఇంగ్లాండ్ పోరాడుతుంది. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో శాయశక్తులా ప్రయత్నిస్తుంది. అటాకింగ్ ఫీల్డ్ సెట్ చేసి భారత్ కు షాక్ ఇవ్వాలని చూస్తుంది. దీంతో రాంచీ టెస్టు రసవత్తరంగా మారింది. లంచ్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. క్రీజ్ లో గిల్ (18) జడేజా (3) ఉన్నారు. భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే మరో 74 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.
నాలుగో రోజు పిచ్ గింగరాలు తిరుగుతుండటంతో ఈ మ్యాచ్ లో భారత్ జాగ్రత్తగా ఆడితేనే విజయం సాధించే అవకాశం ఉంది. వికెట్లేమీ కోల్పోకుండా 40 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కు రోహిత్, జైస్వాల్ తొలి వికెట్ కు 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ దశలో ఇంగ్లాండ్ స్పిన్నర్లు విజ్రంభించడంతో 84/0 తో ఉన్న భారత్ 100/3 తో నిలిచింది. 37 పరుగులు చేసిన జైశ్వాల్ భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ చేసి కుదురుకున్నాడనుకున్న రోహిత్(55), పటిదార్(0) వెంట వెంటనే ఔటయ్యారు.
దీంతో మ్యాచ్ లో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అనుమానం కలిగించారు. ఏ దశలో జడేజా, గిల్ లంచ్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా సెషన్ ను ముగించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో హార్టిలి, రూట్, బషీర్ తలో వికెట్ తీసుకున్నారు.
4th Test, Day 4: India (307 & 118/3; S Gill 18*, R Jadeja 3*) at Lunch, need 74 runs to win against England (353 & 145)#INDvsENG #INDvENG
— CricketNDTV (@CricketNDTV) February 26, 2024
Live Scorecard: https://t.co/KxNEmYS6pZ
Live Updates: https://t.co/IEJ8PZhSYT pic.twitter.com/n3n7qS6egg