2024 ఐపీఎల్‌‌ ఆడొద్దని జోఫ్రా ఆర్చర్‌‌‌‌కు ఈసీబీ ఆదేశం!

2024 ఐపీఎల్‌‌ ఆడొద్దని జోఫ్రా ఆర్చర్‌‌‌‌కు ఈసీబీ ఆదేశం!

లండన్ :  వచ్చే ఐపీఎల్‌‌కు ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌‌‌‌ దూరంగా ఉండనున్నాడు. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో పాల్గొనేందుకు పని భారం తగ్గించుకుందుకు ఐపీఎల్‌‌లో ఆడొద్దని అతడిని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆదేశించినట్లు తెలుస్తోంది. 2022 ఐపీఎల్‌‌ వేలంలో ఆర్చర్‌‌‌‌ను  రూ. 8 కోట్లకు కొనుగులు చేసి ముంబై ఇండియన్స్ గత వారం అతడిని రిలీజ్‌‌ చేసింది.

అయితే, ఈనెల19న దుబాయ్‌‌లో జరగనున్న ఐపీఎల్ వేలానికి రిజిస్టర్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో అతని పేరు లేదు. ఆర్చర్ పలు గాయాలతో బాధ పడుతున్నాడు. గత సీజన్‌‌లో ఆడుతుండగా మోచేయి గాయం తిరగబెట్టింది. అప్పటి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్‌‌లోనూ ఆడలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏప్రిల్, మేలో తమ పర్యవేక్షణలో యూకేలో ఉన్నట్లయితే ఆర్చర్‌‌‌‌ తొందర్లోనే నేషనల్ టీమ్‌‌లో రీఎంట్రీ ఇస్తాడని ఈసీబీ భావిస్తోంది. ఆర్చర్ ఇప్పటికే ఈసీబీతో రెండేండ్ల ఒప్పందంపై సంతకం చేశాడు.