Cricket World Cup 2023: వాంఖడేలో పరుగుల వరద పారించిన దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్ టార్గెట్ 400

Cricket World Cup 2023: వాంఖడేలో పరుగుల వరద పారించిన దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్ టార్గెట్ 400

వరల్డ్ కప్ లో బ్లాక్ బస్టర్ మ్యాచ్ గా భావించిన ఇంగ్లాండ్ -సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అంచనాలకు మించి జరుగుతుంది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో పరుగుల వరద ఖాయమనుకుంటే అంతకు మించి సఫారి బ్యాటర్లు చెలరేగి ఆడారు. డికాక్, మిల్లర్ ని మినహాయిస్తే వచ్చిన వారు వచ్చినట్టుగా చెలరేగిపోయారు. దీంతో ఇంగ్లాండ్ ముందు  400 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఉంచింది. 

నెదర్లాండ్స్ మీద ఓడిపోయిన బాధ ఇంగ్లాండ్ మీద చూపిస్తుంది సౌత్ ఆఫ్రికా. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సఫారీలు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ప్రారంభంలోనే డికాక్ వికెట్ కోల్పోయినా వాండెర్ డస్సెన్(60) రీజా హెన్డ్రిక్స్(85) ఏ మాత్రం తడబడకుండా ఇంగ్లీష్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఇక ఆ తర్వాత వచ్చిన మార్కరం 42 పరుగులతో రాణించాడు.

ఇదంతా ఒక ఎత్తయితే హెన్రిచ్ క్లాసన్ 67 బంతుల్లోనే 109 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. మరోవైపు ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్( 42 బంతుల్లో 75) సైతం బౌండరీల వర్షం కురిపించి ఇంగ్లాండ్ కి చుక్కలు చూపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో తొప్లీకి మూడు వికెట్లు, అదిల్ రషీద్, అట్కిన్సన్ కి రెండు వికెట్లు దక్కాయి. ఇక ఈ మ్యాచులో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తొలి మ్యాచు ఆడబోతున్నాడు.