భారత్ తో 5 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్..రెండో టెస్టులో ఓడిపోయింది. హైదరాబాద్ లో టీమిండియాకు షాక్ ఇచ్చిన ఇంగ్లాండ్ వైజాగ్ టెస్టులో గట్టి పోటీనిచ్చింది. దీంతో సిరీస్ లో తర్వాత జరగబోయే టెస్ట్ మ్యాచ్ లపై ఆసక్తి నెలకొంది. మూడో టెస్ట్ కోసం రాజ్ కోట్ వేదికగా ఫిబ్రవరి 15 న జరగనుంది. ఈ టెస్టు కోసం ఇంగ్లాండ్ రాజ్ కోట్ కు కాకుండా అబుదాబి వెళ్లనుంది.
వైజాగ్ లో జరిగిన రెండో టెస్ట్ ఫిబ్రవరి 4న ముగిసింది. మూడో టెస్టు మ్యాచ్ జరగడానికి 10 రోజుల సమయం ఉంది. ఈ గ్యాప్ లో ఇంగ్లాండ్ అబుదాబికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లాండ్ క్రికెటర్ల ఫ్యామిలీ ఇక్కడకి చేరుకోనుందని సమాచారం. కొన్ని రోజులు ఇక్కడే రెస్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలని భావిస్తోందట. స్పిన్ ట్రాక్ ను ఏర్పాటు చేసుకొని ప్రాక్టీస్ చేయనుంది. 12 లేదా 13 న ఇంగ్లాండ్ రాజ్ కోట్ చేరుకునే అవకాశం ఉంది.
మరోవైపు భారత్ నేరుగా రాజ్ కోట్ చేరుంటుందో లేదో చూడాలి. తొలి రెండు టెస్టులకు మాత్రమే భారత జట్టును ప్రకటించిన టీమిండియా..చివరి మూడు టెస్టులకు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. గాయాలతో దూరమైన జడేజా, రాహుల్.. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న కోహ్లీ, కిషాన్ జట్టులో ఎంట్రీ ఇస్తారేమో చూడాలి. తొలి టెస్టును 28 పరుగులతో ఓడిపోయిన భారత్.. సెకండ్ టెస్టులో 106 పరుగుల తేడాతో విజయం సాధించింది.
The England team departed to Abu Dhabi for a break ahead of the 3rd Test in Rajkot. pic.twitter.com/yO7ss8QqJw
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2024