బజ్ బాల్.. క్రికెట్ అంటే ఇంగ్లాండ్ తగ్గేదే లేదంటుంది. తమ అలవాటును ఆనవాయితీగా కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఘోరంగా విఫలమైన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ లో మాత్రం టీమిండియాకు చెమటలు పట్టిస్తుంది. మూడో రోజు లంచ్ సమయానికి వికెట్ నష్టానికి 15 ఓవర్లలోనే 89 పరుగులు చేసి మ్యాచ్ ను ఆసక్తికరంగా మార్చింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 101 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో మరో 9 వికెట్లు ఉన్నాయి. దీంతో మ్యాచ్ లో ఎలాంటి ఫలితం అయినా వచ్చే అవకాశం కనిపిస్తుంది.
తొలి ఇన్నింగ్స్ లో మంచి ఆరంభాన్ని ఇచ్చిన ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలి రెండో ఇన్నింగ్స్ లో కూడా వేగంగా ఆడి తొలి వికెట్ కు 45 పరుగులు జోడించారు. ఆరంభం నుంచే నుంచే వీరిద్దరూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. ఈ దశలో అశ్విన్ ఒక అద్భుతమైన బంతితో 31 పరుగులు చేసిన క్రాలిని వెనక్కి పంపాడు. ఈ దశలో డకెట్ కు జత కలిసిన పోప్ తొలి బంతి నుంచే ధాటిగా ఆడటంతో ఇంగ్లాండ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ప్రస్తుతం క్రీజ్ లో డకెట్(38) పోప్ (16) ఉన్నారు.
మూడో రోజు 7 వికెట్లకు 421 పరుగులతో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన రోహిత్ సేన 436 పరుగులకు ఆలౌటైంది. దీంతో 190 పరుగుల ఆధిక్యం లభించింది. జడేజా ఓవర్ నైట్ స్కోర్ కు మరో ఆరు పరుగులు మాత్రమే జోడించి 87 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా ఔటయ్యాడు. తర్వాత బంతికే బుమ్రా గోల్డెన్ డకౌట్.. చివరి వికెట్ గా అక్షర్ పటేల్ వెనుదిరిగారు. దీంతో 15 పరుగులకే భారత్ తమ చివరి మూడు వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో రూట్ 4 వికెట్లు తీసుకున్నాడు.
England trails India by 101 runs at Lunch!
— India Today Sports (@ITGDsports) January 27, 2024
ENG: 89/1 in 15 overs (& 246) vs IND (436)#INDvsENG
Follow Live:https://t.co/EUBugKWvpb