AUS vs ENG: నేటి నుంచి ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. లైవ్ ఇలా చూసేయండి

AUS vs ENG: నేటి నుంచి ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా టీ20 సిరీస్.. లైవ్ ఇలా చూసేయండి

ఇంగ్లాండ్- ఆస్ట్రేలియా జట్ల మధ్య నేటి నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. బుధవారం(సెప్టెంబర్ 11) రాత్రి 11:00 గంటలకు ఈ ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది. రెండూ బలమైన జట్లు కావడంతో హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. సొంతగడ్డపై ఆడుతుండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చేదే అయినా.. ఆస్ట్రేలియన్లను తక్కువ అంచనా వేయలేం. శ్రీలంకపై టెస్ట్ సిరీస్ నెగ్గి ఇంగ్లీష్ జట్టు మంచి ఊపు మీదుండగా.. స్కాట్లాండ్‌ను ఓడించి కంగారూలు అలానే ఉన్నారు.

ఈ ఇరు జట్ల మధ్య 3 టీ20లు, 5 వన్డేలు జరగనున్నాయి. టీ20లకు సౌతాంప్టన్, కార్డిఫ్, మాంచెస్టర్ ఆతిథ్యమివ్వనుండగా.. వన్డేలు నాటింగ్‌హామ్, లీడ్స్, చెస్టర్-లీ-స్ట్రీట్, లార్డ్స్, బ్రిస్టల్ వేదికగా జరగనున్నాయి.  టీ20లు రాత్రి 11 గంటలకు.. వన్డేలు మధ్యాహ్నం 3;30 గంటలకు, సాయంత్రం 6:30 గంటలకు మొదలు కానున్నాయి. ఈ సిరీస్‌ల షెడ్యూల్ ఏంటి..? లైవ్ మ్యాచ్ ఏ ఛానెల్‌లో వస్తుంది..? అనేది తెలుసుకుందాం.

Also Read :- నాకు అక్కడ ఎలాంటి మద్దతు లభించలేదు

పూర్తి షెడ్యూల్

టీ20లు

  • మొదటి టీ20 - సెప్టెంబర్ 11(సౌతాంప్టన్)
  • రెండో టీ20 - సెప్టెంబర్ 13 (కార్డిఫ్)
  • మూడో టీ20 - సెప్టెంబర్ 15 (మాంచెస్టర్)

వన్డేలు

  • మొదటి వన్డే - సెప్టెంబర్ 19(నాటింగ్‌హామ్)
  • రెండో వన్డే - సెప్టెంబర్ 21 (లీడ్స్)
  • మూడో వన్డే - సెప్టెంబర్ 24(చెస్టర్-లీ-స్ట్రీట్)
  • నాలుగో వన్డే - సెప్టెంబర్ 27 (లార్డ్స్)
  • ఐదో వన్డే - సెప్టెంబర్ 29(బ్రిస్టల్)


లైవ్ స్ట్రీమింగ్ వివరాలు

ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా వైట్-బాల్ సిరీస్ లైవ్ మన దేశంలోని సోనీ స్పోర్ట్స్ 5, సోనీ స్పోర్ట్స్ 5 HD ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. డిజిటల్ గా Sony Live యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ ఆస్వాదించవచ్చు. ఫ్యాన్‌కోడ్ యాప్ లోనూ ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి.

జట్లు

ఇంగ్లండ్

టీ20 జట్టు: ఫిల్ సాల్ట్ (సి), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జోర్డాన్ కాక్స్, సామ్ కర్రాన్, జోష్ హల్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమ్మద్, డాన్ మౌస్లీ, ఆదిల్ రషీద్, జామీ ఓవర్టన్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్.

వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, జోష్ హల్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జామీ స్మిత్, ఓలీ స్టోన్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్.

ఆస్ట్రేలియా

టీ20 జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నాలీ, ఆడమ్ జంపా.

వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), ట్రావిస్ హెడ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, మార్నస్ లాబుస్‌చాగ్నే, కామెరాన్ గ్రీన్, మాథ్యూ షార్ట్, మిచెల్త్ , మిచెల్త్ స్టార్క్, ఆడమ్ జంపా.