టీ20 వరల్డ్ కప్ 2024లో ప్రస్తుతం సూపర్ 8 మ్యాచ్ లు హోరాహోరీగా జరుగుతున్నాయి. గ్రూప్ 2 లో భాగంగా శనివారం (జూన్ 23) అమెరికాతో ఇంగ్లాండ్ పోరుకు సిద్ధమైంది. బార్బడోస్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఇప్పటికే అమెరికా టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ కు కీలకంగా మారింది. అమెరికాతో జరిగే ఈ పోరులో ఇంగ్లాండ్ భారీ విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ తక్కువ తేడాతో గెలిస్తే వీరి సెమీస్ అవకాశాలు వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మ్యాచ్ పై ఆధారపడి ఉంటుంది.
గ్రూప్ 2 లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, అమెరికా జట్లున్నాయి. వీటిలో అమెరికా ఆడిన రెండు మ్యాచ్ లు ఓడిపోయి సెమీస్ ఆశలను కోల్పోయింది. శనివారం (జూన్ 22) వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో భారీ ఓటమి ఆ జట్టు సెమీస్ ఆశలను దెబ్బ తీసింది. దీంతో ఇప్పుడు ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ సెమీస్ రేస్ లో ఉన్నాయి. టాప్ 2 లో నిలిచి ఏ జట్లు సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటాయో అంతు చిక్కడం లేదు. సౌతాఫ్రికా ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచి సెమీస్ కు చేరువగా వెళ్లినా.. ఇంకా అధికారికంగా బెర్త్ ఖరారు కాలేదు.
వెస్టిండీస్ ఇంగ్లాండ్ పై ఓడిపోవడంతో తమ చివరి మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు ఇంగ్లాండ్ వెస్టిండీస్ పై గెలిచి సౌతాఫ్రికాపై ఓడింది. చివరి మ్యాచ్ లో అమెరికాపై భారీ విజయంపై కన్నేసింది. సౌతాఫ్రికా తమ చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఓడిపోతే రన్ రేట్ తో ఇంటి దారి పట్టే అవకాశముంది. మూడు జట్లు బలంగా ఉండడంతో ఏ జట్టు సెమీస్ కు చేరుతుందో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ భారత్ సెమీస్ ఫైనల్ కు వస్తే ఈ మూడు జట్లలో ఏ జట్టుతో సెమీస్ ఆడతారో అని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు.
ఇంగ్లాండ్ తుది జట్టు అంచనా:
ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ.
USA తుది జట్టు అంచనా:
స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్, ఆరోన్ జోన్స్ (కెప్టెన్), కోరీ అండర్సన్, మిలింద్ కుమార్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, నోస్తుష్ కెంజిగే, అలీ ఖాన్, సౌరభ్ నేత్రవల్కర్.