
నాటింగ్‌హామ్: జో రూట్ (122), హ్యారీ బ్రూక్ (109) సెంచరీలకు తోడుగా బౌలింగ్‌లో షోయబ్ బషీర్ (5/41) చెలరేగడంతో.. నాలుగు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ 241 రన్స్ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరోటి మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది.
ఇంగ్లండ్ నిర్దేశించిన 385 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు ఆదివారం నాలుగో రోజు బరిలోకి దిగిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 36.1 ఓవర్లలో 142 రన్స్‌కే కుప్పకూలింది. బ్రాత్‌వైట్ (47) టాప్ స్కోరర్. అంతకుముందు 248/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 92.2 ఓవర్లలో 425 రన్స్‌కు ఆలౌటైంది.